Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో తండ్రి మళ్లీ అదే చిల్లర వివాదం

By:  Tupaki Desk   |   9 Feb 2019 11:03 AM GMT
స్టార్‌ హీరో తండ్రి మళ్లీ అదే చిల్లర వివాదం
X
సీనియర్‌ శివకుమార్‌ ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో స్టార్‌ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. ప్రస్తతం ఆయన తనయులు సూర్య మరియు కార్తీలు తమిళ స్టార్‌ హీరోలుగా వెలుగు వెలుగుతున్నారు. సూర్య, కార్తీలకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులున్న విషయం తెల్సిందే. సూర్య తన అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు, ఆయన అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. కాని ఆయన తండ్రి శివకుమార్‌ మాత్రం అభిమానుల పట్ల దురుసగా వ్యవహరిస్తూ విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నాడు.

కొన్ని నెలల క్రితం శివ కుమార్‌ ఒక షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కు వెళ్లిన సమయంలో అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ ఫోన్‌ ను లాక్కొని మరీ కింద పడేశాడు. అది కాస్త పెద్ద వివాదం అవ్వడంతో, విమర్శలు తట్టుకోలేక ఆ వ్యక్తికి కొత్త ఫోన్‌ కొని మరీ ఇచ్చాడు. మళ్లీ ఇప్పుడు అదే తరహా వివాదంలో శివ కుమార్‌ చిక్కుకున్నాడు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శివకుమార్‌ తో సెల్ఫీ తీసుకునేందుకు వ్యక్తి ప్రయత్నించగా ఆ వ్యక్తి ఫోన్‌ ను కొట్టాడు.

ఆ ఫోన్‌ కింద పడి పోయింది. సెల్ఫీ ఇష్టం లేకుంటే వద్దని చెప్తే సరిపోతుంది, కాని ఇలా ఫోన్‌ ను నెట్టేయడం ఏంటని మళ్లీ శివకుమార్‌ పై విమర్శలు చేస్తున్నారు. శివ కుమార్‌ మళ్లీ మళ్లీ ఇదే చిల్లర వివాదాన్ని మూట కట్టుకుంటున్న నేపథ్యంలో సూర్య మరియు కార్తీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీ అన్న తర్వాత సెల్ఫీలకు అభిమానులు వెంట పడతారు. ఇష్టం లేదంటే కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది. అఆ కాదని ఫోన్‌ లను పగుల కొడుతూ పోతే ఎలా చెప్పండి అంటూ సోషల్‌ మీడియాలో శివ కుమార్‌ ను నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి