Begin typing your search above and press return to search.

సూర్య-శ్రుతి జోడీ.. భ‌లే ఉందే..

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:31 AM GMT
సూర్య-శ్రుతి జోడీ.. భ‌లే ఉందే..
X
శ్రుతి హాస‌న్ తో తొలిసారి ప‌ని చేసిన స్టార్ హీరో సూర్య‌నే. వీళ్లిద్ద‌రూ క‌లిసి ‘సెవ‌న్త్ సెన్స్ సినిమాలో న‌టించారు. మొద‌ట్లో శ్రుతికి ఐరెన్ లెగ్ అన్న‌ ముద్ర ప‌డ్డా అదేమీ ప‌ట్టించుకోకుండా త‌న‌తో జోడీ క‌ట్ట‌డానికి ఒప్పుకున్నాడు సూర్య‌. ఆ సినిమా ఆడ‌కున్నా త‌ర్వాత.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ ద‌గ్గ‌ర్నుంచి వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్లింది శ్రుతి. ఇప్పుడామె సౌత్ ఇండియ‌న్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రు. ఇప్పుడు మ‌ళ్లీ శ్రుతి.. సూర్య స‌ర‌స‌న న‌టిస్తోంది. ఆ సినిమానే ‘ఎస్‌-3’. సింగం సిరీస్ లో భాగంగా వ‌స్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో సూర్య‌-శ్రుతి ఎలా ఉంటుందో శాంపిల్ గా ఒక ఫొటో వ‌దిలింది ‘ఎస్‌-3’ టీమ్‌.

‘సెవ‌న్త్ సెన్స్’ రోజుల‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది సూర్య‌-శ్రుతి జంట‌. శ్రుతిలో ప్ర‌స్తుతం ఎంతో మెచ్యూరిటీ క‌నిపిస్తోంది. ఇద్ద‌రి జోడీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. సినిమాలో సూర్య‌-శ్రుతి కెమిస్ట్రీ భ‌లేగా ఉంటుంద‌ని ఈ ఫొటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. మూడో భాగంలోనూ అనుష్క ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమాకు శ్రుతినే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. దీపావ‌ళి కానుక‌గా ‘ఎస్‌-3’ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా డిసెంబ‌రు 19న త‌మిళ‌-తెలుగు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ‘సింగం తొలి రెండు భాగాలు సూప‌ర్ హిట్ట‌యిన నేప‌థ్యంలో ‘ఎస్‌-3’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/