సురేష్ బాబు ఆవేదన చెందుతున్నారా?

Thu Jun 14 2018 19:35:47 GMT+0530 (IST)

టాలీవుడ్ లో గత కొంత కాలంగా వస్తున్న రూమర్స్ కొంత మందికి చాలా టెన్షన్స్ తెప్పించాయి. అలాగే క్యాస్టింగ్ కౌచ్ నుంచి శ్రీ రెడ్డ్ వివాదం ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఎక్కువగా దగ్గుబాటి ఫ్యామిలీకి మాత్రం ఆ వివాదాలు టెన్షన్ తెప్పించిందని టాక్ వచ్చింది. అసలే శ్రీ రెడ్డి వివాదంతో సురేష్ బాబుకు ఊహించని తలనొప్పులు ఎదురవ్వగా ఇప్పుడు రానా ఆరోగ్యానికి సంబందించి రిపోర్ట్స్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయని కథనాలు వెలువడుతున్నాయి.రానా కు ఆల్ రెడీ కంటికి సంబందించిన లోపం గురించి ఇబ్బంది పడుతుండగా ఇతర అనారోగ్యం ఒకటి మరింతగా ఆ ఫ్యామిలీకి బాధని కలిగిస్తోందని ఫిల్మ్ నగర్ లో ఒక రూమర్ వచ్చింది. దీంతో సురేష్ బాబు చిక్కిత్స కోసం రానాను విదేశాలకు తిప్పుతున్నారు అని అంటున్నారు. అయితే రానాకు చిన్నప్పుడే కన్ను ఒకటి పోవడంతో.. దాని స్థానంలో వేరే కన్ను పెట్టారు. ఇష్యూకు కన్నుకు సంబంధించినది కాని.. వేరేది కాదంటూ ఇటీవలే క్లారిటీ కూడా వచ్చింది. ఇకపోతే పెద్ద కొడుకు ఆరోగ్యం ఓ వైపు.. మరోవైపు చిన్న కొడుకు వల్ల ఇబ్బందులు సురేష్ ఫ్యామిలిలో ప్రశాంతత లేకుండా చేస్తున్నట్లు కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఇది ఎంతవరకు నిజమో తెలియందు గాని సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్ ను మాత్రం ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టనివ్వట్లేదు అని టాక్ వస్తోంది. అలాగే సురేష్ బాబు తన ఆవేదనను ఎవ్వరికీ కనిపించకుండా నిబ్బరంగా ఉంటున్నారని కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా.. ఈ రూమర్లు ఎలా ఉన్నా కూడా.. ప్రస్తుతం ఆయన 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా రిలీజ్ ప్లానింగులో బిజీగా ఉన్నారు.