Begin typing your search above and press return to search.

హీరో సూర్యను ఆశ్చర్యపర్చిన క్రికెటర్‌ రైనా

By:  Tupaki Desk   |   22 May 2019 6:58 AM GMT
హీరో సూర్యను ఆశ్చర్యపర్చిన క్రికెటర్‌ రైనా
X
తమిళ స్టార్‌ హీరో సూర్య తాజాగా 'ఎన్జీకే' చిత్రంలో నటించాడు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్జీకే చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా సూర్య తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేశాడు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా సూర్యను టీం ఇండియా క్రికెటర్‌ సురేష్‌ రైనా ఒక ప్రశ్న అడిగాడు. తనకు సురేష్‌ రైనా ట్వీట్‌ చేయడంపై సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ట్విట్టర్‌ లో సూర్యను ఉద్దేశించి... చెన్నై సూపర్‌ కింగ్స్‌ లో మీరు ఇష్టపడే క్రికెటర్‌ ఎవరు.. ఎందుకు అంటూ సురేష్‌ రైనా ప్రశ్నించాడు. అందుకు సూర్య సమాధానంగా అనుమానం లేకుండా మీరు మరియు ధోని అంటే నాకు చాలా అభిమానం. మీకున్న పాటలు పాడే నైపుణ్యం వల్ల నాకు ఇష్టం. అలాగే ధోనికి ఉన్న డ్రాయింగ్‌ నైపుణ్యం వల్ల అతడు నాకిష్టం అంటూ సూర్య ఫన్నీగా సురేష్‌ రైనా ట్వీట్‌ కు సమాధానం ఇచ్చాడు. ఇదే సమయంలో మీరున్న బిజీకి నాతో మాట్లాడే సమయం దొరికడం నమ్మలేక పోతున్నానంటూ సురేష్‌ రైనాకు సూర్య కృతజ్ఞతలు చెప్పాడు.

ఎన్జీకే చిత్రంలో నంద గోపాల కృష్ణ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. సాయి పల్లవి మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా నటించారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందిన ఈ చిత్రంతో సూర్య మరో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా ఫ్యాన్స్‌ ఉన్నారు.