Begin typing your search above and press return to search.

దగ్గుబాటి బంధువులతో చై-శామ్ వేడుక

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:20 AM GMT
దగ్గుబాటి బంధువులతో చై-శామ్ వేడుక
X
టాలీవుడ్ బ్యూటిఫుల్ లవర్స్ బెస్ట్ కపుల్స్ అయినా తర్వాత అక్కినేని వారి ఇంట ప్రతి మూమెంట్ ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇరు సంప్రదాయాలను గౌరవించి రెండు సార్లు ఒకటైన అక్కినేని నాగ చైతన్య - సమంత ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా సమంత ఎక్కడ కనిపించినా చాలా పాజిటివ్ గా చిరునవ్వుతో అక్కినేని సమంత అని పరిచయం చేసుకుంటోంది.

అయితే వీరి పెళ్లి వేడుకలను గోవాలో ఇరు కుటుంబాలు క్రిస్టియన్ - హిందూ పద్ధతుల్లో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో నాగార్జున అందరికి రిసెప్షన్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. మొదట అక్కినేని నాగ చైతన్య తల్లి లక్షి తన పుట్టింటి వారి సమక్షంలో కొడుకుకి చిన్న రిసిప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారట. ఆ వేడుకను చైతు మేన మామ దగ్గుబాటి సురేష్ బాబు ఘనంగా నిర్వహించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం ఈ పార్టీలో వెంకటేష్ - రానా మరియు వారి దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారట. నెల్లూరు - కారంచేడు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి దగ్గుబాటి దగ్గరి బంధువులు రానున్నట్లు టాక్. సురేష్ బాబు తన ఇంట్లో ప్రయివేట్ గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే రిసిప్షన్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కొత్త దంపతులకు ఒక బహుమతిని పంపినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది కేవలం ఒక రూమర్ అని తెలుస్తోంది.