ఒకే ప్రొడక్షన్లో.. మూడు సినిమాలు

Tue Jun 19 2018 17:24:53 GMT+0530 (IST)

ఒక సినిమా హిట్ అయితే కచ్చితంగా ఆ సినిమా డైరెక్టర్ మరియు యాక్టర్లకు మంచి పేరు రావడం సహజం. కానీ సినిమా విడుదల అవ్వకముందే కథను నమ్మి డబ్బులు పెట్టె ప్రొడ్యూసర్లు దొరకటం అంత సులభం కాదు. తరుణ్ భాస్కర్ విషయంలో మాత్రం ప్రొడ్యూసర్లు కథను మాత్రమే కాదు తరుణ్ టాలెంట్ ని కూడా నమ్మారు.ఆ నమ్మకాన్ని నిలుపుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యాడు తరుణ్ భాస్కర్. అతని పెళ్లి చూపులు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిమ అవసరం లేదు. చిన్న సినిమాగా మన ముందుకు వచ్చి పెద్ద సినిమాలకంటే ఎక్కువగానే బాక్స్ ఆఫీస్ వద్ద హంగామా చేసింది ఆ సినిమా. అందుకే పెద్ద ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబు వరుసగా మూడు సినిమాలు తరుణ్ తో చేయడానికి ముందుకొచ్చారు. అంతకంటే భాగ్యమా అని తరుణ్ భాస్కర్ కూడా వెంటనే సైన్ చేసేసాడు.

అందులో మొదటగా రాబోతున్న సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. ఇది నలుగురు స్నేహితుల కథ. కామెడీ ఎంటర్టైనర్ గా జూన్ 29న మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత కూడా మరొక రెండు సినిమాలు సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే చేయనున్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు లాగానే ఈ నగరానికి ఏమైంది కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.