Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కొత్త యూనియన్

By:  Tupaki Desk   |   25 Jun 2018 4:09 AM GMT
టాలీవుడ్ లో కొత్త యూనియన్
X
టాలీవుడ్ లో నటీనటుల కోసం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉంది. ఇదే జనాలందరికీ బాగా నోటయిన యూనియన్. ఇవి కాక టెక్నికల్ డిపార్టెంట్లలోనూ సంఘాలున్నాయి. నిర్మాతలకు సంబంధించి ఇంతకుముందు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉండేది. అది రకరకాల కారణంతో ఇప్పుడు మనుగడలో లేకుండా పోయింది. ఈ టైంలో టాలీవుడ్ లో పెద్ద ప్రొడ్యూసర్లలో ఒకరైన సురేష్ బాబు కొత్తగా ప్రొడ్యూసర్ల కోసం ఓ యూనియన్ స్టార్ట్ చేయబోతున్నారు.

పాత యూనియన్ లో అవినీతి పెరిగిపోయిందని.. లెక్కలేనన్ని తప్పులు జరిగాయని అంటున్నారు సురేష్ బాబు. వాటినిప్పుడు సరిచేయడం కన్నా కొత్త యూనియన్ పెట్టడమే బెటరంటున్నారు. ‘‘కొత్త ప్రొడ్యూసర్ల కోసం ఓ వర్క్ షాప్ పెడదామని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను అడిగితే వాళ్లెలాంటి ఇంట్రస్ట్ చూపించలేదు. ఇక్కడ వందలాది మంది ప్రొడ్యూసర్లున్నారు. యాక్టివ్ గా సినిమాలు తీసేవాళ్లు చాలా తక్కువమంది. అందుకే కొత్త యూనియన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా’’ అంటూ సురేష్ బాబు తన ఆలోచన వెనుక మాట చెప్పుకొచ్చారు.

నాతోపాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నిర్మాతలతో కలిసి ఈ యూనియన్ పెడతా. గత మూడేళ్లలో సినిమాలు నిర్మించిన వారినే మాతో కలుపుకొంటామని సురేష్ బాబు చెబుతున్నారు. కొత్తగా ప్రొడ్యూసర్లు అవుదామని సరైన నాలెడ్జ్ లేనివారికి గైడెన్స్ ఇచ్చేలా తాను పెట్టబోయే కొత్త యూనియన్ ఉంటుందని అన్నారు.