Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి గురువు మెగాస్టారే..

By:  Tupaki Desk   |   19 Feb 2018 1:00 PM GMT
మెగాస్టార్ కి గురువు మెగాస్టారే..
X
మెగాస్టార్ చిరంజీవి తర్వాత చిత్రం సై రా నరసింహ రెడ్డి చిత్రంపై మామూలుగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. పైగా భారీ తారాగణం చూశాక అవి ఇంకా పెరిగిపోయాయి. అందరికంటే ఆసక్తిని పెంచిన పేరు మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దే. కానీ అమితాబ్ నిజంగా సై రా చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారా లేదా?

అమితాబ్ స్పెషల్ రోల్ గురించి బోలెడు ఊహాగానాలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నప్పటికీ, బిగ్ బి మాత్రం ఈ విషయమై ఏ ఇంటర్వ్యూ లోను మాట్లాడలేదు, ఎక్కడా పోస్ట్ కూడా పెట్టలేదు. కనుక అందరూ ఈ సినిమా లో అమితాబ్ లేరు అనే నమ్మకానికి వచ్చేేయబోయారు. కానీ అదే సమయానికి అన్ని రుమర్లకు చెక్ పెడుతూ సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి అమితాబ్ ని కలిసి ఆయన పోషించాల్సిన పాత్ర గురించి వివరించారు. తన శిష్యుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లో బ్రిటిష్ పై తిరుగుబాటు చేయాలన్న ఆలోచనలు కలగడంలో గురువు అయిన గోసాయి వెంకన్న కీలక పాత్ర పోషించారు. ఆ గోసాయి పాత్రలొనే ఇపుడు అమితాబ్ నటించబోతున్నారు. అంటే టాలీవుడ్ మెగాస్టార్ కి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ మనకు కన్నుల విందు చేయబోతున్నారు అన్నమాట.

పాత్ర చిన్నదే అయినా కథ మొత్తం పై ఆ పాత్ర ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అందుకే సురేందర్ రెడ్డి ఈ పాత్రకు ఒక ప్రముఖ యాక్టర్ మాత్రమే సరిపోతాడు అని వెతికి మరీ అమితాబ్ ను ఎంచుకున్నారు. త్వరలో బిగ్ బి కూడా చిత్రీకరణ లో పాలు పంచుకోబోతున్నారు. మరుసటి షెడ్యూల్ రాబోయే వారంలో మొదలు పెట్టాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు.