సూరి కిక్ లో చెర్రీ మునిగాడా?

Mon Feb 19 2018 20:46:06 GMT+0530 (IST)

కిక్ మూవీతో దర్శకుడు సురేందర్ రెడ్డి అందరినీ బాగానే మెప్పించాడు. మూడేళ్ల క్రితం కిక్ 2 లాంట్ ఫ్లాప్ వచ్చినా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ పై నమ్మకం ఉంచి రామ్ చరణ్ చేసిన ధృవ మూవీ.. అటు హీరోకి.. ఇటు దర్శకుడికి ఇద్దరికీ బాగానే కిక్ ఇచ్చింది.ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా ను దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నాడు సూరి. చిరంజీవి మూవీతోనే ఈ ఏడాదంతా గడిపేస్తాడు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత మళ్లీ రామ్ చరణ్ తోనే సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ఈ దర్శకుడు. అంతగా మెగా ఫ్యామిలీని మెప్పించేస్తున్నాడు ఈ డైరెక్టర్. ప్రస్తుతం స్టోరీ లాక్ చేసుకునే దశలో ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోందంటే.. సురేందర్ రెడ్డి స్పీడ్ అర్ధమవుతుంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ క్యూట్ లవ్ స్టోరీ ఇది అని తెలుస్తోంది.

అయితే.. ఈ సినిమా ఇప్పుడప్పుడే మొదలయ్యే ఛాన్స్ లేదు. అటు చిరంజీవి సినిమా పూర్తి కావాలి.. ఇటు చెర్రీ కూడా ఫుల్లు బిజీనే. బోయపాటితో అనౌన్స్ చేసిన మూవీ.. రాజమౌళితో చేయాల్సిన సినిమా.. ఈ రెండూ పూర్తయ్యాకే సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ చేస్తాడు. అంటే.. వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి కానీ.. ఈ చిత్రం పట్టాలెక్కే ఛాన్సే లేదన్న మాట.