టాలీవుడ్ ఆంటీని అస్సలు ఆపలేం

Thu May 17 2018 10:42:35 GMT+0530 (IST)

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఫుల్లు గ్లామరస్ గా ఉంటున్నారు. గతంలో అక్క.. వదిన పాత్రలు అంటే వాటికి కొందరు యాక్టర్స్ పరిమితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం పలువురు బ్యూటీస్ ఇలాంటి రోల్స్ లో కూడా తమ ట్యాలెంట్ చూపించేస్తున్నారు. తెలుగులో ఇలా అక్క..వదిన పాత్రలలో మెరుపులు మెరిపించేవారిలో సురేఖా వాణి కూడా ఉంటుంది.ఈమె సినిమాల్లో ఎప్పుడూ మన పక్కింటి మహిళ మాదిరి క్యారెక్టర్లలోనే కనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో ఇలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అడపా దడపా హీరోయిన్స్ కు అమ్మగా నటించేందుకు కూడా అభ్యంతరాలు చెప్పని సురేఖా వాణి.. ఇప్పుడు హాట్ అవతారంలోకి మారిపోయింది. రీసెంట్ గా ఈమె సమ్మర్ వెకేషన్ కు వెళ్లగా.. అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సురేఖా వాణి. ఈ గెటప్ లో ఆమెను ఎప్పుడూ చూడని ఆమె ఫాలోయర్స్ ఒక్కసారిగా షాక్ తినేశారు.

బికినీ వేసుకుని పూల్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది సురేఖా వాణి. షార్ట్ డ్రెస్సులలో కూడా తను ఎంజాయ్ చేస్తున్న వైనాన్ని అభిమానులకు చూపించింది ఈ హాట్ ఆంటీ. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా టీనేజ్ డాటర్ ఉన్న సురేఖా వాణి.. ఇంత హాట్ గా కనిపించడం ఇదే ఫస్ట్ టైం.