ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచిన హాట్ బ్యూటీ

Sat Aug 05 2017 13:56:53 GMT+0530 (IST)

క్రేజ్ కోసం గ్లామర్ డోస్ పెంచడం హీరోయిన్లకి అలవాటే. అయితే అందాల ఆరబోసిన కొంతమంది ముద్దుగుమ్మలకి కాలం కలిసి రాక సరైన అవకాశాలు రావు. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు సినీ జనాలకు దగ్గరైంది హాట్ బ్యూటీ సురభి అయితే రఘువరన్ లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలో కనిపించిన సురభికి ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ బీరువా. ఈ సినిమాలో నటన అలానే గ్లామర్ విషయంలో కాస్త పరిమితంగా కనిపించిన సురభికి ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ జెంటిల్ మెన్ - ఎక్స్ ప్రెస్ రాజా హిట్స్ తరువాత ఈ బ్యూటీ పై కాన్సన్ ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు తెలుగు దర్శకనిర్మాతలు.అయితే మీడియం రేంజ్ హీరోలకే సెట్ అయ్యే ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించాలని తహతహలాడుతుందట. అందుకోసం ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల్నే ఉపయోగించుకోవాలని అనుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం సురభి చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. ఈ సినిమాలో మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకోవడానికి సురభి ఈ సినిమాలో అందాల ఆరబోతలో పరిమితులు పక్కక్కుపెట్టేసిందని తెలిసింది. ఈ సినిమాలో ఓ సాంగ్ లో సురభి గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోవడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాకి ఓ వినూత్నమైన టైటిల్ ని త్వరలోనే ఎనౌన్స్ చేసే అవకాశం ఉందట. మరి మెగా హీరో సపోర్ట్ లో కెరీర్ లో ఇంకాస్త ముందుకు వెళ్లడానికి సురభి వేసిన ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.