Begin typing your search above and press return to search.

ఈ వారం.. టగ్ ఆఫ్ వార్ తప్పదా..

By:  Tupaki Desk   |   3 May 2016 5:30 PM GMT
ఈ వారం.. టగ్ ఆఫ్ వార్ తప్పదా..
X
ఈ వారం రెండే రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 24 అయితే.. రెండోది సాయిధరం తేజ్ మూవీ సుప్రీమ్. సూర్య డబ్బింగ్ సినిమాతో వస్తుంటే.. తేజు రిలీజ్ చేస్తున్నది డైరెక్ట్ మూవీ. రెండింటిపైనా ఇండస్ట్రీలో ఆసక్తి ఎక్కువగానే ఉండడంతో.. ఏ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందనే డిబేట్ జరుగుతోంది.

రేంజ్ పరంగా చూసుకుంటే సూర్యనే పెద్ద హీరో. కానీ ఈ తమిళ స్టార్ సినిమా తెలుగులో సక్సెస్ సాధించి చాలా కాలమే అయింది. 24కు దర్శకుడు మనం తీసిన విక్రమ్ కె కుమార్ కావడంతోనే ఈ రేంజ్ ఆసక్తి నెలకొంది. కానీ సుప్రీం విషయానికి వచ్చేసరికి చాలానే పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. తేజు నటించిన ఆఖరి మూవీ సుబ్రమణ్యం ఫర్ సేల్.. 20 కోట్లకుపైగా కొల్లగొట్టేసి, ఈ కుర్రాడి స్టామినాని ఇండస్ట్రీకి చూపించింది. మరోవైపు పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ కావడం, దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన చిత్రించడంతో.. సుప్రీమ్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.

ఒక రోజు ముందే థియేటర్లలోకి వస్తుండడం కలెక్షన్స్ పరంగా సుప్రీమ్ కు అడ్వాంటేజ్. వీకెండ్స్ వరకూ నో డౌట్. ఆ తర్వాత టాక్ ఉంటే సరైనోడు ఊపులో ఉన్న మెగా ఫ్యాన్స్ కలెక్షన్స్ కుమ్మేయడంలో బోలెడంత ప్లస్ అవుతారు. కానీ సూర్య 24ని బతికించాలంటే మాత్రం.. కంటెంట్ ఒక్కటే ఆధారం అవుతుంది. అందుకే సూర్య - సుప్రీమ్ లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర టగ్ ఆఫ్ వార్ ఆడక తప్పదంటున్నారు.