Begin typing your search above and press return to search.

రజినీ సూపర్ స్టార్ అయినది ఎప్పుడంటే

By:  Tupaki Desk   |   2 May 2016 11:30 AM GMT
రజినీ సూపర్ స్టార్ అయినది ఎప్పుడంటే
X
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్సాహంతో గెంతులేస్తారు. తమిళనాట అయితే.. రజినీ మాయ ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగు నాట కూడా బాషా తర్వాత రజినీకాంత్ కు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. సూపర్ స్టార్ అనే పదానికి అసలు సిసలైన అబ్రివేషన్ అన్నట్లుగా ఉండే రజినీకి.. ఈ బిరుదు 1978లో ఇచ్చేశారు.

మొదటగా 1978లో భైరవి అనే మూవీ కోసం సూపర్ స్టార్ అనే బిరుదును వాడారు. సినిమాలో ఈ క్రెడిట్ కనిపించకపోయినా.. మెయిన్ థియేటర్స్ దగ్గర ఉంచిన కటౌట్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ అని వేయించారు. అప్పటికి శివాజీ గణేశన్ - ఎంజీ రామచంద్రన్ లాంటి మహామహులు ఉండడంతో రజినీ వద్దని చెప్పినా.. భైరవి మేకర్స్ మాత్రం వినలేదు. ఆ తర్వాత 1980లో నాన్ పొట్ట సవాల్ అనే మూవీలో సూపర్ స్టార్ అని టైటిల్ కార్డ్స్ లోనే వేశారు. ఇప్పుడు రజినీకాంత్ అని కనిపించే కంటే ముందే సూపర్ స్టార్ అనే లెటర్స్ వస్తాయి. ఇలా వేయడాన్ని కూడా 1980ల్లోనే స్టార్ట్ చేశారు.

కాయ్ కొడుక్కుం కాయ్ - మాపిళ్లై - రాజాధి రాజ చిత్రాల్లో ఇలా సూపర్ స్టార్ విడిగా, రజినీకాంత్ విడిగా వేశారు. 1990లకు వచ్చేసరికి సూపర్ స్టార్ రజినీకాంత్ అనే స్పెషల్ డిజైన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కో అక్షరం పడుతుండగానే, ఆ మ్యూజిక్ వినే సూపర్ స్టార్ రజినీకాంత్ అని ముందే చెప్పేయగలిగేలా ఈ వర్డింగ్ బాగా పాపులర్ అయింది.