Begin typing your search above and press return to search.

అమ్మడి లక్కు అలా ఉంది.. హిట్టు ఎంట్రీ!

By:  Tupaki Desk   |   9 Feb 2019 4:37 PM GMT
అమ్మడి లక్కు అలా ఉంది.. హిట్టు ఎంట్రీ!
X
గతంలో సినిమాల్లో స్టార్ హీరో ఎంట్రీ అంటే అదో ప్రహసనం. దానికి ఒక పెద్ద ఎపిసోడ్ రెడీ చేసేవారు.. కాలి బూటు ఫస్ట్ చూపించి.. ప్యాంటు.. మొకాలు..కాలు ఆ తర్వాత చెయ్యి.. వీలైతే ఆ చేత్తో ఒక రౌడీని ఒకటి తగిలించి మరీ ఫైనల్ గా ఫేస్ చూపించేవారు. అప్పుడు 'సస్పెన్స్' వీడినట్టుగ వెర్రెత్తినట్టు జనాలు విజిల్స్ తో రెచ్చిపోయేవారు. ఆ ఎంట్రీలు ఇప్పుడు లేవు. సినిమా ఎంట్రీలు పక్కన పెడితే ఎవరైనా హీరో కానీ హీరోయిన్ గానీ మొదటి సినిమాతో సూపర్ హిట్ సాధించడం బ్లాక్ బస్టర్ ఎంట్రీనే కదా. అలాంటి ఎంట్రీలలో అనుపమ పరమేశ్వరన్ ను కొట్టేవారు లేరు.

మలయాళంలో 'ప్రేమమ్' సినిమాలో ఒక చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చింది అనుపమ. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత తెలుగులో 'అ ఆ' తో ఎంట్రీ ఇచ్చింది. ఆది సూపర్ హిట్. మరో వైపు 'కొడి' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వంతు. తాజాగా 'నట సార్వభౌమ' సినిమాతో శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ టాప్ లీగ్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమా హీరో. మొన్న గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ వచ్చిందిగానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ములేచిపోతున్నాయి. ఫుల్ రన్ లో సినిమా సూపర్ హిట్ గా నిలిచేలా ఉంది. అంటే అనుపమకు శాండల్ వుడ్ లో కూడా సూపర్ ఎంట్రీనే.

ఒక భాషలో సూపర్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడమేమీ సాధారణ విషయం కాదు కానీ కొంతమంది విషయంలో అయినా అలా జరుగుతుంది. కానీ ఇలా ఎక్కడ అడుగుపెడితే అక్కడ సూపర్ హిట్ ఎంట్రీ కావడం మాత్రం ఒక్క అనుపమ విషయంలో మాత్రమే జరిగిందేమో.