ట్రెండీ టాక్: సామ్ వర్సెస్ సామ్

Mon Mar 25 2019 10:28:16 GMT+0530 (IST)

అక్కినేని కోడలు సమంత డ్యూయల్ గేమ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఓవైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తూ కెరీర్ గేమ్ లో నిష్ణాతురాలిగా పేరు తెచ్చుకుంది. అందుకే ప్రతిసారీ సమంత నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కి వస్తూ అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. ఈ తరహా ఛాన్స్ సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క నయనతారకు తప్ప వేరొక నాయికకు లేనేలేదు.2018లో సమంత నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజై ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. తెలుగులో `యూటర్న్` రిలీజైన సమయంలోనే అటు తమిళంలో `సీమ రాజా` రిలీజైంది. ఆ రెండు సినిమాల రిజల్ట్ మాట ఎలా ఉన్నా సమంత హవా సౌత్ లో ఏ రేంజులో ఉందో అందరికీ అర్థమయ్యింది. ప్రస్తుతం సేమ్ సన్నివేశం రిపీటవుతోంది. 2019లోనూ సామ్ నటించిన సినిమాలు వరుసగా క్యూ కడుతున్నాయి. సమంత- నాగచైతన్య జంటగా నటించిన `మజిలీ` ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సినిమా రిలీజైన ఆరు రోజుల గ్యాప్ లోనే సామ్ నటించిన తమిళ చిత్రం
సూపర్ డీలక్స్ రిలీజవుతోంది. మార్చి 29న రిలీజ్ అంటూ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఎలాంటి కట్స్ లేకుండా `ఏ` సర్టిఫికెట్ తో `సూపర్ డీలక్స్` రిలీజవుతోంది. 2 గంటల 56 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్న భారీ రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. ఇందులో సమంతతో పాటు రమ్యకృష్ణ నటిస్తున్నారు. శివకార్తికేయన్ ఫహద్ ఫాజిల్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత పాత్ర ఆసక్తికరం. ఓ పెళ్లయిన గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది. మధ్య తరగతి కుటుంబంలోని స్ట్రగుల్స్ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నారట. యాథృచ్ఛికమే అయినా మజిలీ సూపర్ డీలక్స్ చిత్రాల్లో తన పాత్రలు రిలేటెడ్ గా ఉండడం ఆసక్తికరం.