Begin typing your search above and press return to search.

వరుణ్ స్టెప్పులు సూపర్బ్ గా..

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:10 PM GMT
వరుణ్ స్టెప్పులు సూపర్బ్ గా..
X
టాలీవుడ్ లో మరో తొలిప్రేమ మెగా కాంపౌండ్ నుంచే భారీ అంచనాలతో రాబోతోంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మెగా యువ హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమా తరువాత తన బాబాయ్ టైటిల్ తో లక్కును పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కి సంబందించిన చిన్న న్యూస్ వచ్చిన ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా ఫిల్మ్ నగర్ లో సినిమా అడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.

అయితే సినిమాలో మొదటి వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సునోనా సునైనా అనే ఆ రాకింగ్ సాంగ్ కి లైకులు బాగానే పడుతున్నాయి. ఎందుకంటే వరుణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. మొదటి ప్రేమ అదే అనుకుంటా. అందుకే ఓ మగువ ముందు తన తొలి ప్రేమ ను స్టెప్పులు వేసి మరి చూపిస్తున్నాడు. ఇక అతనికి సపోర్ట్ గా ఫారిన్ లేడీస్ కూడా స్టైలిష్ స్టెప్పులతో అలరిస్తున్నారు. ఇక పాటలో ఉన్న సునైనా అనే అమ్మాయి ఘాటుగా కనిపిస్తోంది.

జీన్స్ టీషర్ట్ కాంబినేషన్ లో ఆమె అందాలు పాటకు బోనస్ అనిపించేలా ఉన్నాయి. ఇక వరుణ్ కూడా స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు. థమన్ అందించిన మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉంది. సినిమాలో మ్యూజిక్ మెయిన్ ప్లస్ పాయింట్ అవ్వనుందట. మరి సినిమా తొలి ప్రేమ స్థాయిలో ఆకట్టుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే ఫిబ్రవరి 9వరకు ఆగాల్సిందే.