Begin typing your search above and press return to search.

సన్నీ లియోన్.. ఇంకా ఇరవై ఏళ్లా?

By:  Tupaki Desk   |   22 Jan 2017 9:10 AM GMT
సన్నీ లియోన్.. ఇంకా ఇరవై ఏళ్లా?
X
ఆల్రెడీ సన్నీ లియోన్ కు 35 ఏళ్లు వచ్చేశాయి. అయినప్పటికీ ఫిజిక్ బాగానే మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంటోంది. ఇదే రీతిలో మెయింటైన్ చేస్తే ఇంకో నాలుగైదేళ్లు బాగానే నెట్టుకొచ్చేయొచ్చేమో. కానీ సన్నీ లియోన్ ఆలోచన వేరుగా ఉంది. ఆమె ఇంకో 20 ఏళ్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఏలేయాలనుకుంటోంది. ఇక్కడి నుంచి ఇప్పుడిప్పుడే కదిలే ఛాన్సే లేదంటోంది. కేవలం తన అందాలతోనే నెట్టుకొస్తున్న సన్నీ మరీ 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉండాలని టార్గెట్ పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే రెండేళ్లు కూడా తాను ఇక్కడ ఉండలేనని అన్నవాళ్లకు సమాధానంగా 20 ఏళ్లు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సన్నీ చెబుతోంది.

బాలీవుడ్లోకి వచ్చిన కొత్తలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని.. తన గురించి చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారని సన్నీ చెప్పింది. తాను రెండేళ్లలో ఇక్కడి నుంచి అన్నీ సర్దుకుని వెళ్లిపోతానని ఎద్దేవా చేశారని.. కానీ తాను ఇంకో 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉంటానని.. తన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని సన్నీ స్పష్టం చేసింది. తనకు అవకాశాలు రావని అవమానించిన వాళ్లు.. తానంటే గట్టినివాళ్లు ‘రాయీస్’ లాంటి పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని తెగ ఫీలైన సంగతి తనకు తెలిసినట్లు సన్నీ చెప్పింది. షారుఖ్ ఖాన్ సినిమాలో తాను చేసింది ఒక్క పాటే అయినా అది గొప్ప విషయమే అని.. తనను స్టార్లు దగ్గరికే రానివ్వరన్న వారికి ఇది సమాధానం అని.. మున్ముందు తనకు మిగతా స్టార్లు కూడా అవకాశాలిస్తారని సన్నీ ఆశాభావం వ్యక్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/