Begin typing your search above and press return to search.

సన్నీ లియోన్ ను వెంటాడుతున్న ‘బూతు’కాలం

By:  Tupaki Desk   |   4 Dec 2016 1:30 PM GMT
సన్నీ లియోన్ ను వెంటాడుతున్న ‘బూతు’కాలం
X
చిరంజీవి అంటే మెగాస్టార్ అని.. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ అని అంటాం. సన్నీలియోన్ పేరు చెప్పగానే కూడా అలాగే పోర్న్ స్టార్ అంటారు. కానీ... ఆ పేరెత్తితే చాలు సన్నీ మండిపడుతోందట ఇప్పుడు. ఒకప్పుడు సూపర్ పోర్న్ స్టార్ గా వెలుగు వెలిగి ఆ పాపులారిటీతోనే బాలీవుడ్ లో ఎంటరైన సన్నీకి టాప్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆమె తన గతాన్ని గుర్తు చేస్తే సీరియస్ అవుతోంది.

బాలీవుడ్‌ నటిగా స్థిరపడ్డాక, 'పోర్న్‌' అన్న ప్రస్తావన తెస్తే ఫైరవుతోంది. తాజాగా, నెటిజన్లు 'ఎక్కువగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీ' కేటగిరీలో సన్నీలియోన్‌కి ఫస్ట్‌ ప్లేస్‌ దక్కిన విషయం తెలిసిందే. అయితే... సన్నీ పోర్న్ స్టార్ కావడంతోనే అంత పాపులారిటీ వచ్చిందని పలువురు ఆమె వద్ద ప్రస్తావించడంతో కాస్త సీరియస్ అయింది. ‘బాలీవుడ్‌లో నాకు మంచి ఫాలోయింగ్‌ వుంది.. నటిగా చాలా హిట్‌ సినిమాల్లో నటించాను.. బాలీవుడ్‌లో హాటెస్ట్‌ సెలబ్రిటీని నేను.. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..' అంటూ సీరియస్ గా చెప్పిందట.

నెటిజన్లే కాదు... బాలీవుడ్ లోనూ కొందరు హీరోయిన్లు సన్నీని ఆ టైపులోనే చూస్తున్నారట. సన్నీ క్రేజుకు కారణం ఆమె పోర్ను సినిమాలేనని అంటున్నారట. దీంతో సన్నీ చాలా బాధపడుతోందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/