సన్నీ బొమ్మకు ఆ యాంగిల్ అవసరమా?

Tue Sep 18 2018 20:59:21 GMT+0530 (IST)

సన్నీలియోన్ .. ఆ పేరు తలవని కుర్రాడు ఉన్నాడా?  శృంగార సామ్రాజ్యపు మహారాణిగా యూత్ గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే పేరు ఇది. ఎనిమిది వయసు నుంచి ఎనభై వయసు వృద్ధాగ్రేసరుల వరకూ సన్నీని తలవని వారే ఉండరు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. ఈ విషయాన్ని కాస్త అటూ ఇటూగా సన్నీలియోన్ చాలా సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉంది. తాను ఎంత కాదనుకున్నా ఒక శృంగార తారగానే అందరూ తనని చూస్తారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి కోసం నాడు తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అందులో ఎవరి ఒత్తిడీ బలవంతం లేనేలేదని క్లారిటీనిచ్చింది. తప్పనిసరి అవసరం తనని అటువైపు మరల్చాయని చెప్పింది.సన్నీ ప్రస్తుతం ముగ్గురు బిడ్డలకు తల్లి. డేనియల్ వెబర్ కి భార్య. మరోవైపు బాలీవుడ్ నటిగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. శృంగార తార నుంచి బాలీవుడ్ స్టార్ అవ్వడం వరకూ అటుపై ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగిన తీరు వరకూ ప్రతిదీ తన టీవీ సిరీస్ `కరణ్‌జీత్`లో చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ భాగం పూర్తయింది. రెండో భాగాన్ని టెలీకాస్ట్ చేయనున్నారు.

ఈలోగానే సన్నీ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. దిల్లీలోని మ్యాడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఇదివరకూ ప్రకటించింది. నేడు టుస్సాడ్స్‌లో తన విగ్రహం చెంతనే నిలిచి సన్నీ ఇచ్చిన ఫోజును అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. సన్నీ ఈ విగ్రహంలోనూ శృంగార భంగిమ ప్రదర్శించడం అభిమానుల్లో చర్చకొచ్చింది. విగ్రహంలోనూ ఆ కోణం ఏంటో?  అంటూ అంతా ఒకటే ఇదైపోతున్నారు. తుస్సాడ్స్ శిల్పులకు వచ్చిన ఆ ఐడియాని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు.