సన్నీని ఇలా చూడలేం బాబోయ్..

Sun Feb 18 2018 12:58:20 GMT+0530 (IST)

సన్నీ లియోన్ ను చూడగానే కుర్రాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ కుగుతాయో చెప్పేదేముంది..? ఆమెను ఎప్పుడూ శృంగార కోణంలోనే చూస్తుంది కుర్రకారు. ఆమె యాక్టింగ్ టాలెంట్ చూడాలనో.. నటిగా ఆమెలోని విభిన్న కోణాల్ని చూడాలనో థియేటర్లకు వెళ్లరు. ఆ సంగతి సన్నీకి తెలియంది కాదు. ఆమె ఎప్పుడూ కూడా కుర్రాళ్లను మెప్పించే లాగే కనిపించింది. ఆమెతో సినిమాలు చేసిన దర్శకులు కూడా తనను అలాగే ప్రొజెక్ట్ చేశారు.ఐతే ఇప్పుడు కొత్తగా సన్నీ తనలోని మరో కోణాన్ని చూపించాలనుకుంటోంది. నటిగా తనేంటో రుజువు చేయాలనుకుంటోంది. ఈ మధ్యే సన్నీ ప్రధాన పాత్రలో ‘వీరమహాదేవి’ అనే పీరియడ్ ఫిలిం మొదలైన సంగతి తెలిసిందే. కత్తి పట్టిన వీర నారిగా కనిపించబోతోందామె ఈ సినిమాలో. ఐతే దానికంటే ముందు ఒక హార్రర్ సినిమాలో వయొలెంట్ రోల్ చేస్తోంది సన్నీ.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో పాట బయటికి వచ్చింది. ఆ పాటలో సన్నీ అవతారం చూసి జనాలు షాకైపోతున్నారు. అందులో దయ్యంలా వికారంగా కనిపిస్తోంది సన్నీ. పళ్లు ఊడిపోయి.. కోరల్లాగా రెండు పళ్లు బయటికి వచ్చి భయంకరంగా ఉందామె. ఎప్పుడూ శృంగార దేవతలా కనిపించే సన్నీ.. ఇలాంటి అవతారంలోకి మారేసరికి జనాలు షాకవుతున్నారు. సన్నీ నిన్నిలా చూడలేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ మాటలు సన్నీ చెవికి ఎక్కుతున్నాయా?