సన్నీ. సన్నజాజి. సితక్కొట్టేసింది.

Sun Aug 13 2017 11:20:33 GMT+0530 (IST)

కొంతమంది అంతే. వాళ్లు ఎంత అందంగా ఉంటారంటే.. దారబోసిన అందాలను ఎన్నిసార్లు దారబోసినా కూడా కళ్ళప్పగించి చూడాలనే అనిపిస్తుంది. అలాంటి అందాల సన్నజాజి ఎవరంటే మాత్రం వెంటనే సన్నీ లియోన్ పేరును చెప్పేవాళ్ళు చేతుల ఎత్తండి. మాకు తెలుసు.. మీరు కూడా ఎత్తేశారని. ఇప్పుడు ఈ సోయగం మరోసారి ఆకట్టుకుంది.ట్రిప్పి ట్రిప్పి అంటూ గంతులేస్తూ మత్తెక్కించడానికి రెడీ అవుతోంది ఈ హాట్ లేడి. త్వరలో రానున్న సంజయ్ దత్ ''భూమి'' సినిమాలో అమ్మడు ఒక స్పెషల్ ఐటెం నెంబర్ చేస్తోంది. యథావిథిగా తన ఒంపుసొంపులను ఆరబోసేస్తోంది. వయస్సు ముప్పయ్యారు (36) వచ్చినా కూడా ఇంకా పదహారు ప్రాయాలు ఆమె సొంతం. అందుకే తనే వయ్యారమైన నడుమును లయబద్దంగా ఆడిస్తున్నట్లు ఆ ఫోటోలో అలా ఊరిస్తోంది. క్రింద నుండి పైకి ఆభరణాలు వేసేసుకుని .. ఆ అందమైన నడుమును మాత్రం శిల్పికి వదిలేశాను అన్నట్లు ఫోజులిస్తోంది సన్నీ.

మేరికోమ్ సారబ్జిత్ వంటి సినిమాలను డైరక్ట్ చేసిన ఓముంగ్ కుమార్ ఈ భూమి సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ తండ్రిగా అదితిరావ్ హైదారి కూతురుగా నటిస్తున్నారు. మరి సినిమాలో మిస్సయిన గ్లామర్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి.. సన్ని లియోన్ తో ఇలా చిందేయించారు. అమ్మడు ఎప్పటిలాగానే సితక్కొట్టేసింది.