Begin typing your search above and press return to search.

సన్నీ మళ్లీ తెలుగులోకి వస్తోంది

By:  Tupaki Desk   |   6 May 2016 5:41 AM GMT
సన్నీ మళ్లీ తెలుగులోకి వస్తోంది
X
ఎక్కడి సన్నీ లియోన్.. ఎక్కడి తెలుగు సినిమా.. ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ వచ్చి మన సినిమాలో నటిస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా..? తెలుగు సినిమా అనే కాదు.. అసలు ఇండియన్ ఫిలింలో ఆమె నటిస్తుందని.. ఆమెను మనవాళ్లు ఆదరిస్తారని ఎవరూ ఊహించలేదు.

కానీ ‘బిగ్ బాస్’ షో పుణ్యమా అని సన్నీ ఇండియాకు వచ్చింది. తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించి ఇక్కడే సెటిలైపోయింది. చివరికి తెలుగు సినిమాలో సైతం ఆమె తళుక్కుమంది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంటు తీగ’ సినిమాలో ఆమె గెస్ట్ ఇచ్చిన గెస్ట్ అప్పీరియన్స్ సినిమాకు బాగానే ప్లస్సయింది.

ఐతే ఆ తర్వాత సన్నీకి మళ్లీ తెలుగులో ఛాన్సివ్వలేదు ఎవ్వరూ. ఐతే ఇప్పుడు మరోసారి తెలుగులో సన్నీతో ఓ పాత్ర చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా సంజీవ్ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ‘బుర్రకథ’ సినిమాలో సన్నీ లియోన్ కనిపించబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే డేట్లు ఇచ్చేసిన సన్నీ.. షూటింగ్ కోసం వచ్చే నెల హైదరాబాద్ ‌కు రానుంది. ఈ సినిమా కోసం సన్నీ మీద కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించబోతున్నారు. ‘కరెంటు తీగ’లో సన్నీ సన్నీ.. పాట తరహాలోనే ఇది కూడా హాట్ హాట్‌గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రమోషన్లలో కూడా ఆమె పేరును ఫుల్లుగా వాడేసుకోవాలని ‘బుర్రకథ’ టీమ్ భావిస్తోంది.