Begin typing your search above and press return to search.

దుబాయ్ లో సన్నీలియోన్ ఏమిచేస్తుంది?

By:  Tupaki Desk   |   25 July 2016 7:52 AM GMT
దుబాయ్ లో సన్నీలియోన్ ఏమిచేస్తుంది?
X
సల్మాన్ ఖాన్ - కత్రినాకైఫ్ - ఐశ్వర్యా రాయ్ - కరీనా కపూర్.. ఇలా బాలీవుడ్ స్టార్స్ అందరినీ అంతర్జాలంలో అభిమానులను కలిగి ఉండటం అనే అంశంలో దాటుకుంటూ ముందుకు వెళ్లిన బాలీవుడ్ బామ.. సన్నీ లియోన్! ప్రస్తుతం సన్నీ కి సంబందించిన ప్రతీ చిన్న విషయమూ అంతర్జాలంలో పెద్ద వార్త అనే చెప్పాలి. కారణం.. సన్నీ కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి.

తాజాగా సన్నీ దుబాయ్ లో ప్రత్యక్షమైంది. ఎందుకు వెళ్లిందబ్బా... అని ఆలోచిస్తున్న అభిమానులకు తాజాగా సమాధానాలు పంపింది సన్నీ. తన భర్త డానియల్ - మరికొంతమంది స్నేహితులతో కలిసి ఇండియన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్ళిందట. ఆ సమయంలో దుబాయ్ ఎడారుల్లో దిగిన సన్నీ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలను చూసి.. సన్నీ స్టిల్స్ సృష్టించిన వేడి - దుబాయ్ ఎండలను తలదన్నిందని అభిమానులు చమత్కరిస్తుంటే... "నా బేబీ సన్నీ ర్యాంప్ మీద నడుస్తుంటే.. ఆహా... అద్భుతహ.." అని పొగిడేస్తున్నాడు ఆమె భర్త డానియెల్.

అడల్ట్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన సన్ని.. ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మ్యాన్ ఫోర్స్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దానికి గల కారణలాను షేర్ చేసుకున్న సన్నీ.. తాను సురక్షిత శంగారాన్ని నేను నమ్ముతాను కాబట్టే ఇలాంటి బ్రాండ్స్ కు పనిచేస్తున్నానని చెప్పుకొచ్చింది.