ఆటలో ఆరితేరుతున్న సన్నీ.. రానా

Tue Sep 12 2017 12:33:19 GMT+0530 (IST)

క్రీడలు.. సినిమాలు.. ఇవి ఒకప్పుడు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు కూడా జోనర్స్ ప్రకారం ఇవి వేరు కానీ.. సినిమాల్లో సెలబ్రిటీలు ఆటల్లోకి చొచ్చుకు వచ్చేస్తున్నారు. అఫ్ కోర్స్.. ఆట ఆడి తమ ట్యాలెంట్ చూపించాలని పెద్దగా అనుకోవడం లేదు కానీ.. వాటిపై కోట్లు కోట్లు కుమ్మరించి ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తున్నారు. లేదా పెద్ద మొత్తాలు పుచ్చుకుని ప్రచారాలు చేస్తున్నారు.

కబడ్డీ లీగ్ ల కోసం ఎంత మంది తారలు కదిలొస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అనేక మంది సినిమా స్టార్స్ ఈ ఆటలో భాగం అవుతూ అలరిస్తున్నారు. ఐపీఎల్.. కబడ్డీ లీగ్ మాదిరిగా ఇంకా అంత సక్సెస్ కాలేకపోయినా.. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న మరో లీగ్.. ఫుట్సల్. ఈ ఫుట్ బాల్ లీగ్ మెల్లగా జనాల్లోకి ఎక్కేస్తోంది. త్వరలో సెకండ్ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడీ లీగ్ కోసం ఇద్దరు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ నుంచి తెలుగు టైగర్స్ టీంకు ప్రచారకర్తగా దగ్గుబాటి వ్యవహరించనుండగా.. సన్నీ లియోన్ ఏకంగా కేరళ కోబ్రాస్ టీంలో వాటా కూడా కొనేసి షాక్ ఇచ్చేసింది. కొన్ని వారాల కోసం కేరళ వెళ్లినపుడు కూడా ఈమెకు అక్కడి జనాల నుంచి సాదర స్వాగతం లభించింది.

లీగ్ అన్న తర్వాత అన్ని టీంలు మిగిలిన ఇతర జట్లతో ఆడాల్సిందే కాబట్టి.. ఈ ఫుట్ బాల్ లీగ్ లో సన్నీ లియోన్ వర్సెస్ రానా పోటీ కూడా కనిపించనుందన్న మాట. అలాగని వీరు నేరుగా తలపడకపోయినా.. తమ టీంలు ఆడుతున్నపుడు అనేక మార్లు స్టేడియంలో కలిసి కనిపించే అవకాశం ఉంటుంది. మరి.. సన్నీ అండ్ రానా కాంబినేషన్ ఎలా ఉంటుంది.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారనే అంశం ఆసక్తిగా మారింది.