సన్నీ వయసు అబద్ధమే..

Mon Apr 16 2018 22:10:55 GMT+0530 (IST)

వయసు పెరిగే కొద్దీ మోడల్స్ అందం కూడా తగ్గుతుంది అంటారు. ఎలాంటి వారైనా మూడు పదుల వయసుకు వచ్చే సరికి తారల సోగసులే ఆమె ఏజ్ ఎంతో చెప్పేస్తాయని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. కానీ సన్నీ లియోన్ విషయంలో ఆ మాట అబద్ధం అవుతుంది. ఆమె వయసు మూడు పదుల దాటిందని ఎవరు చెప్పినా కూడా నమ్మరు. బాలీవుడ్ నుంచి మాలివుడ్ వరకు ఎంతో మంచి క్రేజ్ అందుకున్న సన్నీ అప్పుడప్పుడు ఫొటోలతో హీటెక్కిస్తుంది.అసలే సమ్మర్ వేడి బయట చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ వరల్డ్ లో కూడా సన్నీ అందాల తాకిడికి కుర్రకారు హృదయాల్లో సెగ రేగుతోంది. రీసెంట్ గా ఆమె యెల్లో బికినిలో ఇచ్చిన స్టిల్ మతిపోగొడుతోంది అనే తరహాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆమె వయసు ఇంకా పదహరేనా అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి అయినా కూడా సన్నీ గ్లామర్ గర్ల్ గా మరో పదేళ్లు గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవల సన్నీ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అషేర్ - నోహ్ అని నామకరణం కూడా చేసింది. ఇక అంతకుముందు నిషా అనే పాపని దత్తత తీసుకుంది. ముగ్గురి పిల్లల తల్లిగా సన్నీ తన భర్తతో సంతోషంగా జీవిస్తోంది. రీసెంట్ గా కథువ ఘటన గురించి తన కూతురిని కంటికి రెప్పలా కపడుకుంటాను అని పరోక్షంగా బావోద్వేగంతో స్పందించింది.