Begin typing your search above and press return to search.

గుర్రంపై వీరనారి సన్నీని చూశారా..

By:  Tupaki Desk   |   18 May 2018 3:54 PM GMT
గుర్రంపై వీరనారి సన్నీని చూశారా..
X
స్టార్ హోదా అనేది చాలా సింపుల్ గా రాదు అనే విషయం కొంత మంది హీరోయిన్స్ ని చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సన్నీ లియోన్ ఏ సైడ్ నుంచి సినిమాల్లోకి వచ్చిందో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం సన్నీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతోంది. మొన్నటి వరకు ఐటెమ్ సాంగ్స్ లతో గుర్తింపు తెచ్చుకున్న సన్నీ మెల్లగా నటిగా కూడా తనను తాను మలుచుకుంటోంది.

ఇక నెక్స్ట్ ఎవరు ఊహించని విధంగా ఒక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా ఒక లేడి ఓరియెంటెడ్ కావడం విశేషం అయితే.. అందులోను చారిత్రాత్మక సినిమా కావడం మరో మేజర్ ప్లస్ పాయింట్. వీరమహాదేవి అనే ఒక సినిమా ద్వారా సన్నీ త్వరలోనే మన ముందుకు రానుంది. హిస్టారికల్ వార్ డ్రామాలా ఉండబోయే ఆ సినిమాపై మొన్నటి వరకు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ని చూస్తే సన్నీ ఎదో మ్యాజిక్ చేయబోతోంది అనేలా టాక్ వస్తోంది.

తెల్లని గుఱ్ఱం పై ఆమె కూర్చొని మహారాణి లా కనిపించిన విధానం సరికొత్తగా ఉంది. గుర్రంపై వస్తున్న వీరనారి అన్నట్లు బిల్డప్ అదిరింది. సన్నీ పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం మరికొన్ని నెలల్లో తమిళ్ మలయాళం తెలుగు అలాగే హిందీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వి.సి.వడివుడయాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.