Begin typing your search above and press return to search.

వీడియో టాక్: ట్రిప్పి ట్రిప్పిగా సన్నీ

By:  Tupaki Desk   |   18 Aug 2017 10:02 AM GMT
వీడియో టాక్: ట్రిప్పి ట్రిప్పిగా సన్నీ
X
బేబి డాల్ అంటూ ఇండియాను ఉర్రూతలూగించింది సన్నీ లియోన్. ఆమె గతంలో పోర్న్ స్టార్ కాబట్టి ఆమెను చూడ్డానికి ఎగబడ్డారు అని అప్పట్లో అందరూ అన్నా కూడా.. నిన్న కొచిన్ లో ఆమెను చూడ్డానికి వచ్చిన అభిమాన సందోహాన్ని చూస్తే మాత్రం.. ఆమె గ్లామర్ కు ఇండియాలో చాలామంది కుర్రాళ్ళు భారీగా ఫ్యాన్స్ అయిపోయారనే చెప్పాలి. అందుకే ఈ మధ్యన సన్ని చేస్తున్న ఐటెం సాంగ్స్ పెద్దగా వర్కవుట్ కాకపోయినా కూడా.. ఆమెతో ఇంకా అలాంటి పాటలను చేయిస్తూనే ఉంది బాలీవుడ్.

అదిగో మొన్ననే రయీస్ సినిమాలో షారూఖ్‌ ఖాన్ తో కలసి ఒక ఐటెం సాంగ్ చేసింది సన్నీ. కాని ఆ పాట అంతగా వర్కవుట్ కాలేదు. కాకపోతే సన్ని దారబోసిన గ్లామరసానికి అదే విధంగా పేరొచ్చింది. ఇప్పుడు సంజయ్ దత్ మెయిన్ లీడ్లో వస్తున్న భూమి సినిమాలో కూడా అమ్మడు ట్రిప్పి ట్రిప్పి అంటూ ఒక ఐటెం సాంగ్ చేస్తోంది. పాటలో పెద్దగా విషయం లేకపోయినా కూడా.. సన్ని ఒంపుసొంపులూ ఆమె వేసిన ఆ నాటు స్టెప్పులూ ఊరిస్తున్నాయి. చూస్తుంటే కేవలం ఈ పాట కోసమైనా సదరు సినిమాకు ఇంకాస్త ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయేమో అంటున్నారు సినిమా పండిట్లు.

ఇక సన్ని లియోన్ తెలుగులో కూడా రాజశేఖర్ హీరోగా రూపొందిన 'గరుడ వేగ' సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియదు కాని.. మరి తెలుగులో ఉన్న ఆమె ఫ్యాన్స్ కూడా సన్నీ ఎప్పుడు తెలుగు తెరపై సందడి చేస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అప్పటివరకు ఈ ట్రిప్పీ ట్రిప్పీ సెక్సీ సాంగును చూసి ఎంజాయ్ చేయండే!!