డిజప్పాయింట్ చేశావేంటి సన్నీ!?

Thu May 17 2018 10:24:12 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ భామ.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కుదురుకుపోయింది. తెలుగులో  కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది. రీసెంట్ గా పీఎస్వీ గరుడవేగ మూవీలో ఈమె చేసిన ఐటెం సాంగ్.. మూవీకి బాగానే ప్లస్ అయ్యింది.అయితే.. ఇప్పుడు సన్నీ చేసిన ఓ ట్వీట్ తెలుగు జనాలను హర్ట్ చేసింది. ఆమె ఉద్దేశ్యం సాధారణమే కావచ్చు కానీ.. అది వాస్తవానికి దగ్గరగా లేదంటున్నారు మనోళ్లు. బాలీవుడ్ ఫిలిం జనాల్లో ఎక్కువ మంది.. ఐపీఎల్ మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ టీంకి సపోర్ట్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వీరిలో సన్నీ కూడా చేరిపోయింది. నిన్న ముంబై అండ్ పంజాబ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. అలవాటు ప్రకారం ఆఖరి బంతి వరకు పోరాడిన ముంబై.. మరోసారి లాస్ట్ బాల్ విక్టరీని చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు వచ్చింది సన్నీ.

తన భర్త డానియల్ వెబర్ తో కలిసి వచ్చిన ఈ భామ.. మ్యాచ్ సందర్భంగా 'హాటీతో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నా.. గో ముంబై' అంటూ ట్వీట్ పెట్టింది. ముంబైను సపోర్ట్ చేయడం ఓకే కానీ.. ఇప్పటికీ ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది ముంబై జట్టు. కానీ మన సన్ రైజర్స్ మాత్రం పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉండి.. ఇప్పటికే తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. అలాంటి సమయంలో ముంబైకి మాత్రమే సపోర్ట్ చేసి.. తమను సన్నీ హర్ట్ చేసిందంటూ.. పలువురు సన్ రైజర్స్ ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు.