Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సమ్మర్ కలెక్షన్

By:  Tupaki Desk   |   21 April 2018 4:48 AM GMT
ఫోటో స్టోరి: సమ్మర్ కలెక్షన్
X
ప్రస్తుతం ఎండ వేడి బాగానే మంటలు పుట్టిస్తోంది. ఇదే టైంలో పలువురు సుందరాంగులు సేద తీరడం కోసం వెకేషన్స్ కు వెళ్లిపోయి హంగామా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి బికినీలలో ఫోటోలను పోస్ట్ చేసి తెగ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ లో అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ప్రారంభించింది.

అయితే.. ఈ భామ మరీ ఎక్కుగా సొగసులు ఏమీ ఆరబోయలేదు కానీ.. తన ఒంపులను మాత్రం వయ్యారంగా ప్రదర్శించింద. సమ్మర్ లో ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే అంశంపై మంచి క్లారిటీనే ఇచ్చింది కానీ.. ఈ పోజు మాత్రం ఫ్యాన్స్ ను బాగా గిలిగింతలు పెట్టేస్తోంది. ఇది కమర్షియల్ యాంగిల్ లో పెట్టిన పోస్ట్ అనే సంగతి అర్ధం అవుతూనే ఉంది కానీ.. తన స్టైలింగ్ తో మాత్రం అమ్మడు కుమ్మేసిందనే చెప్పాలి. సౌకర్యవంతంగా ఉండాలనే థీమ్ బాగానే ఉంది కానీ.. ఫోటోలో సన్నీ లియోన్ కనిపిస్తుంటే.. ఇక అందరి కళ్లు ఆమె వయ్యారాల మీదకు మళ్లుతాయి కానీ.. డ్రెస్సుల వైపు వెళతాయా ఏంటి చెప్పండి.

ఇక సన్నీ కెరీర్ భేషుగ్గా సాగిపోతోంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే.. పలు భాషలలో స్పెషల్ సాంగ్ ఆఫర్స్ ను అందుకుంటోంది. బ్రాండ్ అంబాసిడర్ గాను ఈ భామకు మంచి గుర్తింపే ఉంది. పైగా మన దేశంలో సొంత వ్యాపారాలను కూడా మొదలుపెట్టేసి సంపాదనలో కూడా ఆరితేరిపోతోంది సన్నీ లియోన్.