Begin typing your search above and press return to search.

హీటు పెంచే సన్నీ సోడాలు

By:  Tupaki Desk   |   28 May 2017 5:46 PM GMT
హీటు పెంచే సన్నీ సోడాలు
X
ఎండలు బాగా దంచి కొట్టేస్తున్నాయి. రికార్డ్ టెంపరేచర్ లో జనాలకు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాంటి టైంలో సహజంగా సెలబ్రిటీలు స్టార్లు అంతా కూల్ కూల్ ప్లేస్ లకు వెళ్లిపోయి ఎండల నుంచి తప్పించుకోవడమే కాదు.. తెగ ఎంజాయ్ చేసేస్తుంటారు కూడా.

కానీ సన్నీ లియోన్ కి మాత్రం జనాలంటే బోలెడంత ప్రేమ. తన ఎంతగా ఆడియన్స్ ను ప్రేమిస్తుందో.. వారి కోసం ఏమేం చేయగలదో ఇప్పటికే చాలానే చేసి చూపించిన సన్నీ లియోన్.. ఇప్పుడు ఎండ నుంచి సేద తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఎంచక్కా సోడాలు తాగించి బుడతలకు ఎండ వేడి తగ్గించేస్తోంది. ఓ రోడ్డుపై మండుటెండలో నుంచుని కలర్ సోడాలను స్వయంగా పిల్లల చేతికి అందిస్తోంది సన్నీ లియోన్. హాట్ సమ్మర్ లో కలర్ షోడాలు హీటు తగ్గించడం మాట నిజమే కానీ.. వాటిని సన్నీ లియోన్ ఇస్తే వాటి పర్పస్ నెరవేరుతుందా అన్నదే డౌట్.

ఈ షోడాలు బుడతలకు ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. ఏ కుర్రాళ్లకో ఇచ్చుంటేనా.. కూల్ షోడాలు తాగినా.. సన్నీ చేతి మహిమతో వాటి దెబ్బకి కుర్రకారు హీటెక్కి పోయేవారు. ఏమైనా కానీ.. ఈ షోడాల సన్నీని చూస్తుంటే.. ఇండియన్ అలవాట్లకు సన్నీ లియోన్ బాగా అలవాటు పడిపోతున్నట్లుగా ఉంది.