Begin typing your search above and press return to search.

సన్నీ స్ట్రాంగ్ కౌంటర్ విన్నారా

By:  Tupaki Desk   |   23 Sep 2017 5:15 AM GMT
సన్నీ స్ట్రాంగ్ కౌంటర్ విన్నారా
X
పోర్న్ చిత్రాలతో ప్రపంచ మొత్తం అభిమానులను సంపాదించుకున్న సుకుమారి సన్నీ లియోన్. అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని తరహా చిత్రాల్లో మెరుస్తోంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో సన్నీ ఉండాల్సిందే అంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. చేసింది కొన్ని సినిమాలే అయిన సన్నికి ముందు నుంచే అభిమానులు ఉండడంతో ఎక్కడికి వెళ్లినా అభిమానులు చూడటానికి ఎగబడుతున్నారు. ఇక అమ్మడు ఎలాంటి పని చేసినా సెన్సేషన్ గా మారుతోంది.

సాధారణంగా సన్నీ శృంగారానికి సంబంధించిన ఎటువంటి వాటిపైన అయినా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఆమె పోర్న్ చిత్రాల్లో కొనసాగుతున్నప్పటి నుండి కండోమ్స్ వంటి వాటికి ప్రచారాన్ని ఇస్తోంది. అయితే ఈ సారి సన్నీ ఇచ్చిన ఒక కండోమ్ యాడ్ సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 'కమ్‌ ప్లే నవ్‌ రాత్రి బట్‌ విత్‌ లవ్‌' అనే పోస్టర్లతో సన్నీ దర్శనం ఇవ్వడంతో చాలా విమర్శలు వెలువడ్డాయి. ముఖ్యంగా పండగ సందర్బంగా సెక్స్ - కండోమ్ ని ప్రమోట్ చేయించుకుంటున్నారా అని కామేంట్స్ చేశారు.

అయితే ఈ విషయంపై సన్నీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 'నాన్సెన్స్‌.. అది కూడా ఓక వివాదమేనా? అందులో వల్గారిటీ ఏం ఉంది? అదో నార్మల్ యాడ్.. ఒకింత ఇన్నోవేటివ్‌ గా ఆ ప్రకటనని రూపొందించారంతే.. బ్యాడ్ గా ఏముందో చెప్పండి అని కామెంట్స్ చేసింది. అంతే కాకుండా సెక్స్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అది సేఫ్ అండ్ హెల్తీగా ఉండాలని చూపించాం. అంతే గాని కండోమ్ వాడకం మహా పాపం అంటే ఎలా అని తనదైన శైలిలో విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్లు వేసింది.