Begin typing your search above and press return to search.

ఆ సాంగ్ సన్నీ కొట్టేసింది

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:11 AM GMT
ఆ సాంగ్ సన్నీ కొట్టేసింది
X
బాలీవుడ్ బ్యూటీగా మారిపోయిన సన్నీలియోన్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లోకి వచ్చేసింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే రాలేదు కానీ.. ఐటెం నెంబర్స్ విషయంలో మాత్రం టాప్ హీరోయిన్స్ కు.. టాప్ ఐటెం భామలకు పోటీ వచ్చేస్తోంది. ఆ పోటీలో నెగ్గేస్తోంది కూడా. బాలీవుడ్ లో దీపికా లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తారు. మరోవైపు మలైకా అరోరా లాంటి టాప్ ఐటెం బ్యూటీస్ ఉండనే ఉన్నారు. ఇంతమంది ఉన్నా.. సన్నీకి ఛాన్సుల సంఖ్య బాగా పెరుగుతోంది.

ఈ ఏడాది ప్రారంభంలోనే షారూక్ ఖఆన్ మూవీ రయీస్ లో లైలా మై లైలా అంటూ సన్నీలియోన్ వేసిన చిందులను మరచిపోవడం చాలా కష్టం. ఆ మూవీ హైలైట్స్ లో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత బాద్షాహో చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో రొమా్స్స్ చేస్తూ పియా మోర్ అంటూ ఐటెం పాటేసుకుంది. ఈ ఏడాదిలో సన్నీ నటించిన మూడో ఐటెం సాంగ్ గా సంజయ్ దత్ నటిస్తున్న భూమిలో ట్రిప్పీ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ ట్రెండింగ్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. నిజానికి ఈ పాటను మలైకా అరోరాతో చేయించాలని మేకర్స్ భావించారట. ఈ మేరకు మాటా మంతీ కూడా జరిగాయని టాక్. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి మలైకా అరోరా తప్పుకోవాల్సి రావడం.. ఆ ప్లేస్ ను సన్నీలియోన్ తో రీప్లేస్ చేసేసి.. సాంగ్ తీసేయడం జరిగిపోయాయని తెలుస్తోంది.

ఇంతకీ బాలీవుడ్ మున్నీ ఈ పాటనుంచి తప్పుకోవాల్సి వచ్చేందుకు కారణం.. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే అని తెలుస్తోంది. అయితే.. భూమిలోని ట్రిప్పీ సాంగ్ లో మలైకా డ్యాన్స్ వేసి ఉంటే మాత్రం మరింతగా ఆ పాటకు అట్రాక్షన్ వచ్చేదనే టాక్ ఎక్కువగానే వినిపిస్తోంది.