Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎరుపు రంగులో అదిరింది

By:  Tupaki Desk   |   20 March 2018 6:22 AM GMT
ఫోటో స్టోరి: ఎరుపు రంగులో అదిరింది
X
అందం అంటే మనకి ఇప్పటిదాకా కొన్ని అర్ధాలు మాత్రమే తెలుసు. కానీ అందనికే కొత్త అర్ధాలు నేర్పించేస్తున్నారు మన సినిమా తారలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సన్నీ లియోన్ గురించి. ఈమె తన ఫోటోషూట్ ఫొటోలతో అందనికే అందంలా కనిపిస్తోంది.

పోర్న్ స్టార్ గా కెరీర్ లో మొదటి అడుగులు వేసిన సన్నీ ఇప్పుడు అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ లో స్టెప్పులేస్తోంది. ఆమె అందానికి ఎవరైనా ముగ్దులు కావాల్సిందే. ఆమె వన్నె తరగని అందానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. సన్నీ కనిపించేది సినిమాలో అయిదు నిమిషాలే అయినా ఫాన్స్ ఎగబడి మరీ చూస్తారు. అటు బ్రాండ్ ఎండార్స్మెంట్లతో కూడా బిజీగా వుంది ఈ భామ. ఈమధ్యనే స్టార్ స్ట్రక్ లిప్ స్టిక్ ను లాంచ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ఎరుపు రంగు టాప్ లో, అదే రంగు లిప్ స్టిక్ వేసుకుని కెమెరా వైపు చూస్తుంటే ఫాన్స్ మతులు పోతున్నాయి.

క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ, నడుము మీద చేయి వేసుకుని నిలబడి, అటుగా చూస్తోన్న సన్నీ చలికాలంలో కూడా చెమటలు పట్టించేయగలదు అని అర్థమైపోతుంది కదూ.. ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే ఆఫర్లు ఉన్నా తెలుగులో పెద్దగా లేవు. సన్నీ ఆఖరిసారి తెలుగులో గరుడవేగ సినిమాలో మెరిసింది.