Begin typing your search above and press return to search.

ఎయిడ్స్ డే కోసం సన్నీ లియోన్ సందేశం

By:  Tupaki Desk   |   1 Dec 2015 1:30 PM GMT
ఎయిడ్స్ డే కోసం సన్నీ లియోన్ సందేశం
X
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం మస్తీజాదే బృందం ప్రత్యేకమైన సందేశాన్ని రూపొందించింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర బృందం ప్రేక్షకుల కోసం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. సురక్షిత శృంగారంతో హెచ్ ఐవీ రాకుండా చూసుకోవాలని సూచించింది.

ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ శృంగార తార సన్నీ లియోన్ - హీరో తుషార్ కపూర్ - వీర్ దాస్ లు రక్షిత శృంగారంపై తమ అభిప్రాయాలను ఈ వీడియోలో వెల్లడించారు. సెక్సులో మజాను అనుభవించాలని.. అయితే, వ్యాధులు రాకుండా చూసుకోవాలని, అందుకు సురక్షిత శృంగార పద్ధతులు పాటించాలని అన్నారు.

అయితే ఈ సందేశంలో కోసం వారు ఉపయోగించిన నినాదం మహా వేగంతో వ్యాపిస్తోంది. 'అప్నే ఖేలే రఖియే థేలే' (మీ అరటి పండు బుట్టలో పెట్టండి) అంటూ వారు చెబుతున్న సందేశాన్ని ముసిముసి నవ్వులు నవ్వుతూనే అందులో భావాన్ని అందరికీ వ్యాపింపజేస్తున్నారు సోషల్ మీడియా ప్రజలు. ఎయిడ్స్ దినోత్సవం కోసం తయారుచేసిన సందేశం ఈ చిత్ర ప్రచారానికి బాగానే ఉపయోగపడుతున్నట్లుంది. అసలే హాట్ హాట్ హీరోయిన్ సన్నీలియోన్ ఉన్న ఈ సినిమాకు ఇలాంటి డైలాగులతో ప్రచారం చేస్తుంటే జనం ఆగలేకపోతున్నారట. వచ్చే జనవరిలో విడుదల కానున్న మస్తీజాదే కోసం సన్నీ అభిమానులు నిరీక్షిస్తున్నారు.