Begin typing your search above and press return to search.

లైవ్ లో సన్నీ స్టెప్పులేస్తోందోచ్

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:43 PM GMT
లైవ్ లో సన్నీ స్టెప్పులేస్తోందోచ్
X
చాలా ఏళ్ల తర్వాత హీరో రాజశేఖర్ కెరీర్ లో వస్తోన్న సరికొత్త చిత్రం గరుడవేగ. రొటీన్ లవ్ స్టొరీ- చందమామ కథలు అలాగే గుంటూరు టాకీస్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ ఉండడం సినిమాకి చాలా క్రేజ్ ని తెస్తోంది.

సన్నీ లియోన్ ఉంటే చాలు సినిమాకి క్రేజ్ వచ్చినట్టే అని ప్రస్తుతం కుర్రకారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అడుగుపెట్టిన చోట జనసంద్రంతో నిండిపోతోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కూడా అలాగే మారనుందని తెలుస్తోంది. ఎందుకంటే సన్నీ లియోన్ గరుడవేగ లో చేసిన స్పెషల్ సాంగ్ పెర్ఫామెన్స్ ని అలాగే మరికొన్ని డ్యాన్సులని గరుడవేగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేయనుందట.

ఆ వేడుక ఈ నెల 27న హైదరాబాద్ లో నిర్వహించనుంది చిత్ర యూనిట్. మరి ఆ రోజు ఏ స్థాయిలో హైదరాబాద్ అభిమానులు వస్తారో చూడాలి. ఆ వేడుకకి స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ కూడా హాజరుకాబోతున్నారని టాక్. సినిమా ట్రైలర్ కూడా బలయ్యనే లాంచ్ చేయబోతున్నారు. ఇక సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.