Begin typing your search above and press return to search.

తెలుగు నిర్మాత‌కు శృంగార దేవ‌త పాఠాలు

By:  Tupaki Desk   |   20 Jun 2019 7:58 AM GMT
తెలుగు నిర్మాత‌కు శృంగార దేవ‌త పాఠాలు
X
సినిమాకి సంత‌కం చేయాలి.. ర‌మ్మ‌ని పిలిస్తే శృంగార తార స‌న్నీలియోన్ పెట్టిన కండీష‌న్ల‌కు స‌ద‌రు టాలీవుడ్ నిర్మాత‌కు దిమ్మ‌ తిరిగింద‌ట‌. అందునా స‌ద‌రు నిర్మాత ఇన్నేళ్ల కెరీర్ లో ఇలాంటి కండీష‌న్లు ఏనాడూ విన‌లేద‌ట‌. దీంతో స‌న్నీ పెట్టిన కండీష‌న్ల‌కు వామ్మోవ్! అంటూ కంగారు ప‌డ్డాడ‌ట‌!! అంత భ‌య‌పెట్టేలా స‌న్నీ ఏం కండిష‌న్లు పెట్టిందో ఏమిటో..? కాస్త వివ‌రంలోకి వెళ‌దామా..

బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ గురించి ప్ర‌త్యేకించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే మంచు మ‌నోజ్ సినిమాలో న‌టించి అదిరిపోయే ట్రీటిచ్చింది. దాంతో పాటు స‌న్నీ.. ప‌లు ఐటెమ్ నంబ‌ర్ల‌తో తెలుగు యూత్ గుండెల్లో కిరాక్ పుట్టించింది. ఉత్త‌రాది.. ద‌క్షిణాది రెండుచోట్లా స‌న్నీ త‌న‌దైన శైలిలో ఐటెమ్ నంబ‌ర్ల‌తో ట్రీటిచ్చింది. అందుకే స‌న్నీ బ్రాండ్ తో సినిమా తీస్తే దానికి మార్కెట్లోనూ డిమాండ్ అదే రేంజులో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా ఇదే ఫార్ములాతో ఓ టాలీవుడ్ నిర్మాత ఇటీవ‌ల స‌న్నీలియోన్ ని సంప్ర‌దించి సినిమా చేద్దామ‌ని అడిగార‌ట‌.

అయితే అత‌గాడికి స‌న్నీ పెట్టిన కండీష‌న్లు పెద్ద షాక్ నిచ్చాయ‌ట‌. ఇంత‌కీ ఏం కండీష‌న్లు పెట్టింది? అంటే.. తాను ఏదైనా సినిమాకి సంత‌కం చేయాలి అంటే ముందుగా స‌ద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అలెర్టుగా ఉండాలి. సెట్స్ కెళ్ల‌క‌ముందే బౌండ్ స్క్రిప్టుతో రావాలి. సెట్స్ కెళ్లాక కూడా ఒక్క సీన్ ని మార్చినా కుద‌ర‌దు. స్క్రిప్టు ప‌రంగా మార్పులు చేయ‌డానికి వీళ్లేదు అని చెప్పింద‌ట‌. అంటే డైరెక్టుగానే మీకు క్ర‌మ‌శిక్ష‌ణ తెలీదు. నేర్చుకోవాల‌ని సూచించింది. నిజానికి చాలా కాలంగా ఉత్త‌రాది- ద‌క్షిణాది నిర్మాత‌ల క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యాన్ని స‌న్నీలియోన్ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నిస్తోంది. బౌండ్ స్క్రిప్టు లేకుండానే మ‌న నిర్మాత‌లు సినిమాలు తీస్తార‌ని కాస్త తీవ్రంగానే విమ‌ర్శించింది. త‌న‌కు ఎదురైన అనుభ‌వాల్ని పూస గుచ్చి మ‌రీ మీడియాకి చెప్పింది. అందుకే స‌ద‌రు నిర్మాత‌కు కంగారు పుట్టింద‌ట‌. ఇంత‌కీ ఆ బిలో యావ‌రేజ్ నిర్మాత ఎవ‌రై ఉంటారు?