Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : శృంగార తార విర‌హం!

By:  Tupaki Desk   |   24 Sep 2018 1:30 AM GMT
ఫోటో స్టోరీ : శృంగార తార విర‌హం!
X
బాలీవుడ్‌ లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే సౌత్‌ లో అందివ‌చ్చిన అవ‌కాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది స‌న్నీలియోన్‌. ఐటెమ్ భామ‌గా కెరీర్‌ని సాగిస్తూనే - ఇటీవ‌ల ఓ భారీ హిస్టారిక‌ల్ మూవీకి సౌత్‌ లో సంత‌కం చేసింది. సినిమాల‌తో పాటు టీవీ కార్య‌క్ర‌మాల‌తోనూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా కార్య‌క్ర‌మంలోనూ అల‌రిస్తోంది. వీటికితోడు స‌న్నీలియోన్ ఇటీవ‌లి కాలంలో ఎంట‌ర్‌ ప్రెన్యూర్‌ గా కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషించింది. సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వ్యాపారంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి స్టార్‌ స్ట‌క్ ఫ్రాంఛైజీల్ని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తోంది. స‌న్నీ వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలో సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌చారం చేస్తూ, ప‌నిలోప‌నిగా వేడెక్కించే ఫోటోల్ని ట్విట్ట‌ర్ - ఇన్‌ స్టాలో అప్‌ లోడ్ చేస్తోంది.

ఇదిగో వాటిలో లేటెస్ట్ ఫోటో ఇది. స‌న్నీ ఈ ఫోటోలో నెవ్వ‌ర్ బిఫోర్ అన్న తీరుగా క‌నిపిస్తోంది. బ్లాక్ క‌లర్ జీన్స్ బాట‌మ్‌ - దానికి కాంబినేష‌న్‌ గా కాఫీ రంగు టైట్‌ ఫిట్ టాప్‌... పూర్తి ఆపోజిట్ లో ఆరెంజ్ క‌ల‌ర్ చున్నీతో అదిరిపోయే ఫోజిచ్చింది. శృంగార‌తార విర‌హం.. అన్న కాన్సెప్టు ఆ ఫోజులో క‌నిపిస్తోంది. అయితే ఈ ఒక్క ఫోజులో వేరే చాలానే సంగ‌తులున్నాయి. దీనికి ప్ర‌ఖ్యాత కార్ల్‌ ట‌న్ లండ‌న్ ఇండియా - ఐరా స‌న్ గ్లాసెస్‌ - స్ప్లాష్ యాక్సెస‌రీస్‌ - స్ప్లాష్ టాప్ ఇన్ని ర‌కాల బ్రాండ్లు స‌న్నీ ఒంటిపై ఉన్నాయి. వీటికి తోడు ఎలానూ స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌నే త‌న మేక‌ప్‌కి ఉప‌యోగిస్తోంది. హితేంద్ర క‌పోప‌ర ఈ స్టైల్‌ ని డిజైన్ చేశారు. క‌పిల్ కిల్‌ నాని ఈ ఫోటో రూప‌క‌ర్త‌.

అన్న‌ట్టు స‌న్నీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రం `వీర‌మ‌హాదేవి` షూటింగ్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందో ఇటీవ‌ల అప్‌డేట్ లేనేలేదు. ఇదివ‌ర‌కూ వీర‌మ‌హాదేవి ఫ‌స్ట్‌ లుక్ రిలీజైన‌ప్పుడు ఆ లుక్‌ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్‌ కి సిస్ట‌ర్ ఉంటే స‌న్నీలా ఉండేద‌ని, `క్యాట్ ఉమెన్‌`కి ఏమాత్రం తీసిపోని రేంజులో స‌న్నీ ఫోజిచ్చిందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. వీర‌మాదేవి తెలుగు - త‌మిళం - క‌న్న‌డ‌ - మ‌ల‌యాళం - హిందీ భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు అన్ని భాష‌ల నిర్మాత‌లు, పంపిణీదారులు ఇందులో పెట్టుబ‌డులు పెట్ట‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చింది.