రావడానికి సన్నీ గట్టిగా అడిగిందా?

Thu Oct 19 2017 19:00:01 GMT+0530 (IST)

పోర్న్ ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన సెక్సీ సుందరి సన్నీ లియెన్ కి వయసు పెరిగిన కొద్దీ అందం కూడా పెరుగుతోంది. అలాగే అభిమానుల సంఖ్య కూడా తార స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ లను అమ్మడు బలే కవర్ చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా కూడా సన్నీ కి మంచి ఆదరణ అందుకుంటోంది.అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో రిలీజ్ కి రెడీగా ఉన్న గరుడ వేగా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. రాజా శేఖర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలోని డియో డియో అనే పాట ఇప్పటికే చాలా వరకు అందరిని కట్టుకుంటోంది. అలాగే పాటలో సన్నీ డ్యాన్సులు చాలా బావుంటాయని అందరు ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకు ఇంకా భారీ స్థాయిలో హైప్ తేవడానికి చిత్ర యూనిట్ సన్నీతో స్పెషల్ సాంగ్ చేయించనుంది. ఈ నెల 27న జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అమ్మడు చిందులు వేయబోతోందట. కాని అక్కడే ఒక సమస్య వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ కార్యక్రమంలో నాట్యం చేయడానికి అమ్మడు ఎక్స్ర్ ట్రా పైకం కావాలంటూ డిమాండ్ చేస్తోందట. లైవ్ లో అలా డ్యాన్స్ చేయాలంటే సాధారణంగా కోట్లలో పుచ్చుకునే సన్నీ.. ఇప్పుడు ఇలా ఫ్రీగా చేయనంటూ మొండికేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. సర్లేండి.. సన్నీ ఇంతకుముందు కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ స్థాయిలో ఆదరణ దక్కిందో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి.. ఇప్పుడు ఈ డిమాండ్ సహజంగానే ఉండి ఉండొచ్చు.