Begin typing your search above and press return to search.

ఖాన్ ల మధ్యలో సన్నీ.. ఎంత మార్పు

By:  Tupaki Desk   |   22 Jan 2017 6:28 AM GMT
ఖాన్ ల మధ్యలో సన్నీ.. ఎంత మార్పు
X
సన్నీ లియోన్ అంటే.. పోర్న్ స్టార్ అనే ఇమేజ్. ఇండియాలో ముఖ్యంగా బాలీవుడ్ లో అడుగుపెట్టేకంటే ముందే.. అమ్మడికి క్రేజ్ ఉంది. హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అయితే.. దేశవ్యాప్తంగా ఈ భామ క్రేజ్ పీక్ స్టేజ్ కి చేరిపోయింది. ఇండియాలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ యూజర్లు వెతికిన సుందరిగా రికార్డులు కూడా సృష్టించింది. ఇదంతా గతం.

వచ్చే వారం విడుదల కాబోతోన్న రాయీస్ మూవీలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ లియోన్.. ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఒకవైపు సల్మాన్ ఖాన్.. మరోవైపు షారూక్ ఖాన్ ల మధ్యలో నుంచుని.. సినిమాకు ప్రమోషన్ చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేసింది సన్నీ. '5 ఏళ్లుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ అద్భుతమైన క్షణం. పెద్దగా కలలు కనండి.. వాటి కోసం కష్టపడండి.. అవే నిజమవుతాయ్' అంటూ ఈ ఫోటోని పోస్ట్ చేయడంతో పాటు కామెంట్ పెట్టింది సన్నీ.

ప్రస్తుతం సన్నీ ఇమేజ్ మొత్తం మారిపోయింది. బాలీవుడ్ హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందిపెట్టే ప్రశ్నకు.. సన్నీలియోన్ ఇచ్చిన ఆన్సర్స్.. అమ్మడిని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాయి. స్టార్ హీరోలు కూడా ఛాన్సులు ఇచ్చేస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/