Begin typing your search above and press return to search.

హైద్రాబాద్ లో సన్నీ వన్ నైట్

By:  Tupaki Desk   |   2 May 2016 3:30 PM GMT
హైద్రాబాద్ లో సన్నీ వన్ నైట్
X
సన్నీ లియోన్ కు టాలీవుడ్ కొత్తేమీ కాదు.. గతంలో ఓ తెలుగు సినిమాలో చేసినపుడు ఇక్కడ కొన్నాళ్లు మకాం వేసింది. ఆ తర్వాత కూడా సినిమా షూటింగుల కోసం హైద్రాబాద్ కి చాలా సార్లే వచ్చిన సన్నీ.. హైద్రాబాద్ లో పలు ఈవెంట్లకు హాజరవుతూనే ఉంది. ప్రస్తుతం వన్ నైట్ స్టాండ్ అనే మూవీలో నటిస్తున్న సన్నీ.. హైద్రాబాద్ లో చాలానే రాత్రులు గడిపానంటోంది.

హైద్రాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెబుతున్న ఈ బాలీవుడ్ హీరోయిన్.. ముఖ్యంగా బిర్యానీ తన ఫేవరేట్ ఫుడ్ అంటోంది. తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన మనుషులు ఉన్నారని, వీరితో వర్క్ చేయడం చాలా చక్కని అనుభూతి అని చెబుతూనే.. హైద్రాబాద్ బిర్యానీ మిస్ అవుతున్నందుకు బాధగా ఉంటుందని చెప్పింది. తెలుగు సినిమాల్లో నటించేందుకు అభ్యంతరం లేదని చెబుతోంది కానీ.. అప్పటి సన్నీకి, ఇప్పటి బ్యూటీకి చాలానే తేడా ఉండడంతో.. ఇప్పుడంత సన్నీని పట్టుకురావడం అంత తేలిక కాదని ఒప్పుకోవాల్సిందే.

ఇప్పటికే షారూక్ ఖాన్ సినిమాలోనూ చోటు దక్కించుకున్న సన్నీ.. తమతో ఈ భామ నటించేందుకు అభ్యంతరాలు లేవని సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కూడా అనిపించుకుంది. పైగా లస్ట్ బై సన్నీ అంటూ ఓ సొంత బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడమే కాకుండా.. ఈ మధ్యే రైటర్ గా కూడా అవతారం ఎత్తేసింది. ఇన్ని బాధ్యతల మధ్యలో.. తెలుగు సినిమాలో అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తననడం విశేషం.