Begin typing your search above and press return to search.

హాలీవుడ్లో సన్నీ లియోన్ సొంతిల్లు

By:  Tupaki Desk   |   18 May 2017 6:52 AM GMT
హాలీవుడ్లో సన్నీ లియోన్ సొంతిల్లు
X
షారుక్ ఖాన్ సినిమా రయిస్ తో సన్నీ లియోన్ ఇప్పుడు స్టార్ ఐటెమ్ గాళ్ అయ్యింది. లైలా లైలా పాట ఆ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. ఆ తరవాత సినిమాలేమీ పెద్దగా లేవు. అందుకే సొంత ప్రొడక్షన్ లో ఏమైనా ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తునట్లు తెలుస్తుంది. సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు సన్నీ లియోన్ కాలిఫోర్నియా వెళ్లింది. అంటే దీపికా ప్రియాంకా మాదిరిగా.. నటించడానికి కాదులెండి. సొంత ఇంటి పనులు మీద వెళ్లింది సన్నీ.

సన్నీ.. ఆమె భర్త డేనియల్ వెబర్ కలిసి తమ సొంతింటి కలను పూర్తి చేసుకున్నారు. సన్నీ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆ కొత్త ఇంటి గృహప్రవేశం.. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో జరగనుందని తెలుస్తోంది. “ సన్నీ నేను ఈ ఇల్లు కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటికీ మా సొంత ఇంటి కల నెరవేరింది. మా ఇంటి అలంకరణ అంతా రోమ్.. స్పెయిన్ నుండి తెప్పిస్తున్నాం. మా టేస్ట్ తగట్టు ఉంటుంది అని చెప్పాడు” డానియెల్.

సన్నీ బంగళా హాలీవుడ్ ఏరియా కు అతి దగ్గరలో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ , ఐదు గదుల ఇల్లు.. చక్కటి తోట ఉన్న ఇల్లు హాలీవుడ్ లో కట్టుకొని అందరికీ షాక్ ఇచ్చింది సన్నీ. అక్కడ నుండే వచ్చిన సన్నీ ఇల్లు కూడా అక్కడే కొనుక్కోవడం చూస్తే.. ఇప్పుడు ఆమె ప్రయాణం ఎటు మారనుందనే ఆసక్తి కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/