Begin typing your search above and press return to search.

టాలీవుడ్ జనాలకు క్లాసులు మొదలయ్యాయ్

By:  Tupaki Desk   |   25 April 2018 5:22 PM GMT
టాలీవుడ్ జనాలకు క్లాసులు మొదలయ్యాయ్
X
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అలియాస్ లైంగిక దోపిడీ అనే అంశంపై రగిలిపోతోంది. ఎక్కడెక్కడో మొదలైన అంశం.. తిరిగి తిరిగి మీడియా ఛానల్స్ కు.. రాజకీయాలకు కూడా పాకేసింది. అయితే.. అసలు సమస్య మొదలైన పాయింట్ ను కూడా ఫిలిం ఇండస్ట్రీ వదిలిపెట్టలేదు. ఈ విషయంలో ఇప్పటికే పలు కమిటీలను వేశారు. చర్యలు చేపట్టాలని డిసైడ్ చేశారు కూడా.

ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ట్రాఫికింగ్ కు గురైన మహిళలకు పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సునీతా కృష్ణన్ తో.. టాలీవుడ్ కుర్రకారుకు క్లాసులు ఇప్పించే కార్యక్రమం ప్రారంభించారు. సామాజిక వేత్తగా ఎంతో గుర్తింపు ఉన్న సునీతా కృష్ణన్.. పని ప్రాంతాలలో లైంగిక సమానత్వంపై తెలియచెబుతున్నారు. ముఖ్యంగా తోటి మహిళా వర్కర్లతో ఎలా నడుచుకోవాలనే అంశంపై కుర్రాళ్లకు వివరిస్తున్నారు.

ఈమెకు చట్టాల మీద మంచి అవగాహన ఉండడంతో.. ఎలాంటి చర్యలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో కూడా తెలియచేస్తున్నారట. మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తే.. ఎలాంటి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరిస్తున్నారట. అలాగే.. మహిళలు కూడా ఆయా వ్యక్తులను ప్రేరేపించే విధంగా ప్రవర్తించడం తప్పు అనే అంశాన్ని కూడా తెలియచెబుతున్నారట సునీతా కృష్ణన్. తప్పు ఎవరు చేసినా తప్పే అంటున్న ఆమె.. టాలీవుడ్ నుంచి క్యాస్టింగ్ తరిమేసే విధంగా చేపట్టిన చర్యల్లో భాగం అయ్యారు.