సునీల్ ను చూసి యంగ్ హీరోస్ నేర్చుకోవాల్సిందే….

Wed Sep 13 2017 13:00:07 GMT+0530 (IST)

ఈ రోజుల్లో ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. భారీగా ప్రమోషన్స్ చేస్తే తప్ప తమ సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలయట్లేదు. అందుకే ఎంతగా ప్రమోట్ చేసుకుంటే అంత మంచిది. ఈ విషయంలో మనకంటే కూడా బాలీవుడ్ స్టార్స్ చాలా ముందుంటారు. సినిమా ఫినిష్ చేసిన రెండు మూడు నెలల తర్వాత రిలీజ్ పెట్టుకుంటారు. అంటే దాదాపు తమ సినిమాల్ని రెండు మూడు నెలల పాటు ప్రమోట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే హీరోలు - హీరోయిన్స్ కాల్షీట్స్ ఇస్తారు. కానీ టాలీవుడ్ లో అతి కొద్ది మంది స్టార్స్ మాత్రమే తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు టైం ఇస్తున్నారు. అలాంటి అతి కొద్ది మంది హీరోల్లో సునీల్ ఒకరు…సునీల్ హీరోగా నటించిన ఉంగరాల రాంబాబు ఈనెల 15న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు సునీల్. ఈసారి కామెడీ తో పాటు… ఎమోషల్ గా - ఇన్పిరేషనల్ గానూ… మంచి కంటెంట్ తో వస్తున్నామని చెబుతున్నాడు. అందుకే ప్రమోషన్ విషయంలో తగ్గే సమస్య లేదని తేల్చేశాడు. ఎవ్వరినీ వదిలి పెట్టకుండా…. రోజుకు దాదాపు 10 నుంచి 15 ఇంటర్వూలు ఇచ్చాడు.

సునీల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి స్టార్ దాదాపు పది రోజుల పాటు ప్రమోషన్ కోసం కేటాయించి…. న్యూస్ పేపర్స్ - న్యూస్ ఛానెల్స్ - వీక్లీస్ - ఆల్ వెబ్ సైట్స్ - యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వూలు ఇచ్చి ఔరా అనిపించుకున్నాడు.

చాలా మంది హీరోలకు ఇంటర్వూలు ఇవ్వాలంటే ఒళ్లు బద్దకం. ఈ విషయంలో సునీల్ డెడికేషన్ చూసి మీడియా వాళ్లే స్వయంగా పొగుడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు… సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో… సునీల్ ను మించినోడు లేడనే విధంగా పబ్లిసిటీ చేస్తున్నాడు. ఈ విషయంలో చాలా మంది యంగ్ హీరోలు సునీల్ ను చూసి సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేర్చుకోవాల్సిందే అని అంటున్నారు.