Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ కూడా ఉందంటున్నసునీల్

By:  Tupaki Desk   |   28 Aug 2016 4:08 AM GMT
సెంటిమెంట్ కూడా ఉందంటున్నసునీల్
X
ఈ ఏడాది సునీల్ ఫేట్ ఎలా ఉంటుందో అనుకున్నారు కాని.. జక్కన్న సినిమా మాత్రం రివ్యూల పరంగా ఫెయిల్ అయినా కూడా కలక్షన్లపరంగా అదిరిపోయింది. అందుకే ఇప్పుడు ఈ సిక్స్ ప్యాక్ హీరో తనకు అసలు తిరుగేలేదంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు త్వరలోనే ఈడు గోల్డే ఏహా సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే అంతకంటే మించిన న్యూస్ ఒకటుంది.

ఇప్పుడు సునీల్ ఒక రీమేక్ సినిమా చేయబోతున్నాడు. మలాయళంలో హిట్టయిన ''2 కంట్రీస్'' సినిమాను తెలుగులో సునీల్ హీరోగా తెలంగాణ డైరక్టర్ ఎన్.శంకర్ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడం చాలా అదృష్టం అండ్ సెంటిమెంట్ అంటున్నాడు మన సిక్స్ ప్యాకరుడు. ''2 కంట్రీస్ సినిమాను చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా మనం చేస్తే అదిరిపోతుంది అనుకున్నాను. చివరకు ఈ సినిమాను నేనే చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక్కడో సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో దిలీప్ హీరోగా చేసిన 'పందిప్పడు' తెలుగులో 'పూల రంగడు' అంటూ నాకు భారీ హిట్టిచ్చింది. ఇప్పుడు కూడా దిలీప్ సినిమా చేస్తున్నానంటే ఆ సెంటిమెంటే రిపీట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అంటున్నాడు సునీల్.

మొత్తానికి వెంకటేష్‌ అండ్ రామ్ చేతుల్లోంచి ఈ సినిమా సునీల్ చేతిలోకి రావడం నిజంగానే లక్కీ. చూద్దాం మరి బాక్సాఫీస్ దగ్గర ఏమవుతుందో!!