Begin typing your search above and press return to search.

గోపీ సినిమా.. సునీల్ ఉండడంతే

By:  Tupaki Desk   |   27 Nov 2015 4:17 AM GMT
గోపీ సినిమా.. సునీల్ ఉండడంతే
X
టాలీవుడ్ స్టార్ రైటర్లలో ఒకడైన గోపీ మోహన్.. డైరెక్టర్ గా మారేందుకు చాలా నెలల క్రితమే సిద్ధమయ్యాడు. కమెడియన్ నుంచి సోలో హీరోగా ఎదిగిన సునీల్ తో ఓ మాంచి మూవీ చేసి, టాలీవుడ్ లో డైరెక్టర్ గా లాంఛ్ అయ్యేందుకు గోపీ రెడీ అయ్యాడు.

నిజానికి ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ ను సునీల్ యాక్సెప్ట్ చేసి ఏడాది గడిచిపోయింది. ఆ తర్వాత గోపీ మోహన్ ఫుల్ ప్లెడ్జెడ్ గా స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అయితే.. ఆ తర్వాత సునీల్ నుంచి రెస్పాన్స్ లేదు. ముందుగా తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సునీల్ తోనే.. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు గోపీ మోహన్ ఇన్ని నెలలు వెయిట్ చేశాడు. అయితే.. ఇప్పటికీ ఆ హీరో నుంచి మాత్రం సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడం లేదు.

ప్రస్తుతం దిల్ రాజ్ బ్యానర్ లో కృష్ణాష్టమి - ఆకెళ్ల వంశీ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నాడు సునీల్. వీటి షూటింగ్ లో జరుగుతున్న ఆలస్యం.. గోపీ ప్రాజెక్ట్ పై పడుతోంది. ఎప్పటికి స్టార్ట్ అవుతుందో, అసలు మొదలవుతుందో లేదో అనే డౌట్ వచ్చేయడంతో.. సునీల్ తో సినిమాని డ్రాప్ చేసుకుంటున్నట్లు గోపీమోహన్ చెప్పేశాడు. అయితే తన ప్రాజెక్ట్ ఖచ్చితంగా సినిమాగా మారుతుందని, కాకపోతే కొత్త హీరోతో చేయబోతున్నట్లు చెప్పాడు గోపీ మోహన్.