Begin typing your search above and press return to search.

కామెడీ హీరోతో శంకర్ రీమేక్

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:28 AM GMT
కామెడీ హీరోతో శంకర్ రీమేక్
X
దర్శకుడు ఎన్ శంకర్ పలు సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చినా.. రీసెంట్ టైమ్ లో మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. జగపతి బాబు ప్రధాన పాత్రలో జై బోలో తెలంగాణ తర్వాత ఐదేళ్ల పాటు విరామం తీసుకున్న ఈ దర్శకుడు.. రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం ఓ మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని ఎంచుకున్నాడు శంకర్.

మల్లూవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ టూ కంట్రీస్.. అక్కడి ఇండస్ట్రీల్లో కూడా స్థానం సంపాదించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తీసేందుకు బండ్లగణేష్ కూడా ప్రయత్నించాడు. రీమేక్ రైట్స్ కొనేశానని కూడా బండ్ల చెప్పాడు కానీ.. ఇప్పుడా టూ కంట్రీస్ హక్కులు ఎన్ శంకర్ కు దక్కాయి. తనే నిర్మాత కం దర్శకుడిగా ఈ మూవీని తీయనున్నాడు శంకర్. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై రెండో సినిమాగా ఇది తెరెకెక్కనుండగా.. సునీల్ హీరో గా నటించనున్నాడని తెలుస్తోంది.

మలయాళంలో దిలీప్ పోషించిన ఈ పాత్రకు.. సునీల్ కరెక్ట్ ఛాయిస్ అనాల్సిందే. రీసెంట్ గా జక్కన్నతో తన స్టామినా చూపించిన ఈ కామెడీ హీరోకు.. ఇది మరో మంచి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ఎన్ శంకర్ కు కూడా రీంట్రీగా ఈ రీమేక్ బాగానే ఉపయోగపడే ఛాన్స్ ఉంది.