బిగ్ బాస్ లో సునీల్ బల్లే బల్లే

Wed Sep 13 2017 18:25:51 GMT+0530 (IST)

కామెడీ హీరో సునీల్ కు ఈ మధ్య సరైన సక్సెస్ రాలేదు. కమెడియన్ నుంచి హీరోగా మారిన ప్రారంభంలో కెరీర్ బాగానే ఉంది కానీ.. ఈ మధ్య మాత్రం బాగా డల్ అయిపోయింది. వరుస పరాజయాలు విసిగించేస్తున్నాయి. హీరోగా సునీల్ కెరీర్ ప్రశ్నార్ధకం అయిపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో థియేటర్లలోకి వస్తున్న సునీల్ మూవీ ఉంగరాల రాంబాబు.ఈ సినిమా ట్రైలర్ మొదట ఆకట్టుకోలేకపోయినా.. రెండో ట్రైలర్ తో మాత్రం దర్శకుడు క్రాంతి మాధవ్ ఆసక్తి కలిగించగలిగాడు. ఈ మూవీ ప్రచారం  విషయంలో కూడా సునీల్ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ట్రెండీ యాక్టివిటీ అయిన బిగ్ బాస్ లో కూడా ప్రచారం చేయనున్నాడట సునీల్. ఈ కార్యక్రమం కోసం ఫుల్  ప్లెడ్జెడ్ గా ప్రిపేర్ అవుతున్నాడు. అసలే మాంచి కామెడీ టైమింగ్ ఉన్న సునీల్.. తన చతురత అంతా చూపించి మరీ.. బిగ్ బాస్ లో రక్తి కట్టించాలని చూస్తున్నాడట.

సునీల్ తో పాటు మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఉంగరాల రాంబాబులో హరితేజ కీలక పాత్ర పోషించింది. అంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుందని ఆమెకు తెలీదు. ఈ సిట్యుయేషన్ ని బేస్ చేసుకుని కామెడీ స్కిట్స్ పండించబోతున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ నోటి మీదుగా ఉంగరాల రాంబాబు గురించి మాట్లాడే సందర్భం.. ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.