Begin typing your search above and press return to search.

నేను హీరోని కాదు.. కమెడియన్ నే

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 PM GMT
నేను హీరోని కాదు.. కమెడియన్ నే
X
కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఇప్పుడు జక్కన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. ప్రచారంలో కనిపించని సునీల్.. ఇప్పుడు పబ్లిసిటీ కోసం నోరు విప్పాడు. జక్కన్న మూవీ హైలైట్స్ కంటే ముందుగా.. తనను అసలు ఓ హీరోగా చూడద్దని కోరుతున్నాడు ఈ కామెడీ హీరో.

'అంత పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న మీరు, సీరియస్ రోల్స్ ఎందుకు చేస్తున్నారని ఓ ఫ్యాన్ అడిగాడు. అప్పుడే నా తప్పు అర్ధమైంది. అందుకే ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేశాను. ఈ మూవీలో ఉన్న అందరు కమెడియన్స్ లో నేనూ ఒకడిని అంతే. నన్ను హీరో అనుకోవద్దు' అంటున్నాడు సునీల్. ఏదో మిగిలినవాళ్ల కంటే నాలుగు సీన్లు ఎక్కువ.. రెండు ఫైట్లు చేయడం మినహాయిస్తే పూర్తిగా మూవీ అంతా కడుపుబ్బ నవ్వించడమే టార్గెట్ గా జక్కన్న చేశామన్న సునీల్.. ఈ మూవీతో తప్పనిసరిగా హిట్ కొడతానని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

దర్శకుడు వంశీకృష్ణ తీసిన విధానం, రైటర్ భవాని ప్రసాద్ డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయని.. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నాడు సునీల్.