Begin typing your search above and press return to search.

బేబీ సిట్టింగ్.. పిల్లల్ని చూసుకుంటాడట!

By:  Tupaki Desk   |   15 Nov 2018 7:34 AM GMT
బేబీ సిట్టింగ్.. పిల్లల్ని చూసుకుంటాడట!
X
కమెడియన్ సునీల్ ఈజ్ బ్యాక్. కానీ రీ-ఎంట్రీ తర్వాత 'సిల్లీ ఫెలోస్' చేస్తే అది నిరాశపరిచింది. 'అరవింద సమేత' లో గురూజీ తన స్నేహితుడికి బ్రేక్ ఇస్తాడు అనుకుంటే అందులో కామెడీకి స్కోప్ లేకపోవడంతో సునీల్ కామెడీకోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. తాజాగా శ్రీను వైట్ల - రవితేజ కాంబోలో తెరకెక్కిన 'అమర్ అక్బర్ అంటోనీ' లో సునీల్ నటించాడు. ఈ సినిమాలో సునీల్ కోసం వైట్ల ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డిజైన్ చేసిపెట్టాడట.

ఈ సినిమాలో సునీల్ 'బేబీ సిట్టర్ బాబీ' అనే పాత్ర పోషిస్తున్నాడట. ఫస్ట్ హాఫ్ అంతా హోల్ ఆంధ్రా తెలుగు అసోసియేషన్ (వాటా) ఎపిసోడ్ హంగామా సాగుతుందట. ఇందులో రఘుబాబు.. వెన్నెల కిషోర్.. శ్రీనివాస్ రెడ్డి ..సత్య ఇలా పెద్ద గ్యాంగ్ ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో ఈ వాటా గ్యాంగుతో బేబీ సిట్టర్ బాబీ జాయిన్ అయ్యి ఆ హంగామా ను ఇంకాస్త ఎక్కువ చేస్తాడట. సునీల్ కూడా ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లో కి వస్తానని నమ్మకంగా ఉన్నాడు.

సినిమా రిలీజుకు ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి రేపటికల్లా మనకు ఈ బేబీ సిట్టింగ్ బాబీ హంగామా ఏంటో మనకు తెలిసిపోతుంది. వైట్ల కామెడీ ఎపిసోడ్స్ వర్క్ అవుట్ అయితే సునీల్ అభిమానులకు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. బేబీ సిట్టర్ బాబీ అల్లరి చూసేందుకు మీరు రెడీ గా ఉన్నారు కదా?