Begin typing your search above and press return to search.

సునీల్ వద్దన్నాడు.. కిషోర్ సై అన్నాడు

By:  Tupaki Desk   |   30 May 2016 9:30 AM GMT
సునీల్ వద్దన్నాడు.. కిషోర్ సై అన్నాడు
X
సునీల్ హీరోగా టర్నింగ్ ఇచ్చుకుని ఏళ్లు గడిచిపోయింది. ఈ టైంలో మధ్యమధ్యలో కమెడియన్ ఆఫర్స్ చాలానే వచ్చినా.. హీరో పాత్రలనే చేయాలనే కమిట్మెంట్ కి స్టిక్ అయ్యాడు సునీల్. ఇప్పుడీ మాజీ కమెడియన్ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. చిరు 150వ మూవీలో సినిమా అంతా హీరో వెంట ఉండే ఓ కమెడియన్ పాత్ర కోసం మొదట సునీల్ నే అడిగారు.

ఠాగూర్ మూవీలో చిరు-సునీల్ కాంబినేషన్ బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే. పైగా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిరు150వ మూవీలో ఆఫర్ ని సునీల్ యాక్సెప్ట్ చేస్తాడనే అంతా అనుకున్నారు. అయితే.. ఈ ఆఫర్ ని కాదనేశాడు సునీల్. దీంతో ఈ రోల్ ఇప్పుడు వెన్నెల కిషోర్ దగ్గరకు చేరింది. మెగాస్టార్ సినిమాలో ఆఫర్, అది కూడా హీరోకి వెంట ఉండే రోల్.. వెన్నెల కిషోర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ పాత్రకు సై అనేశాడు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి రోల్స్ అన్నిటికీ వెన్నెల కిషోర్ ఒక్కడే ఆప్షన్ అవుతున్నాడు. వీటికి గతంలో సునీల్ నే ప్రిఫర్ చేసేవాళ్లు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఈ పాత్రలకు సునీల్ దూరం కావడంతో.. అందరూ వెన్నెల కిషోర్ కోసమే మొగ్గు చూపుతున్నారు.